Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశం మొత్తం దృష్టి సారించింది. వచ్చే ఏడాది జరగనున్న యూపీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్‌లకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(Up Assembly Elections) 2022లో జరగనున్నాయి. మరో ఏడాది సమయమున్నా ఇప్పట్నించే ఆసక్తి రేపుతోంది. మరోసారి యూపీలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీBJP)ఇప్పట్నించే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గెలుపే లక్ష్యంగా బరిలో దిగేందుకు కావల్సిన చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయాలు, నివేదికల ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల‌ను కేటాయించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. టికెట్ల పంపిణీ కోసం ఓ ఫార్ములా సిద్ధం చేసుకుంది. 


ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 150 మంది సిట్టింగ్‌లకు టికెట్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీరిలో తాజా లేదా మాజీ సిట్టింగులు ఉన్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో టార్గెట్ 350గా(Target 350) బీజేపీ బరిలో దిగనుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వివిధ దశల్లో అభ్యర్ధుల ఎంపిక కార్యక్రమం ఉంటుంది. రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారంలో రావాలంటే యూపీ ఎన్నికల్లో పట్టు నిలబెట్టుకోవడం ఒక్కటే మార్గంగా ఉంది. పార్టీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం యూపీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక కోసం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఓ సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) వివిధ ఏజెన్సీల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారు.  


గత నాలుగున్నరేళ్లుగా పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా లేని ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అంతేకాకుండా ఇటీవల అనవసర, వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలో పెట్టిన ఎమ్మెల్యేలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించారు. 70 ఏళ్లు దాటి వివిధ వ్యాధులతో బాధపడుతున్న ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు నిరాకరించాలని నిర్ణయించింది బీజేపీ అధిష్టానం. కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రయోజనాలుంటాయని పార్టీ భావిస్తోంది. వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, 2017 ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమిపాలైనవారికి ఈసారి నో ఛాన్స్. అభ్యర్ధుల ఎంపిక కోసం జిల్లా అధ్యక్షుల పరిధిలోని సీట్లలో ఒక్కొక్క స్థానానికి మూడు పేర్ల చొప్పున , ప్రాంతీయ బృందాల నుంచి మరో మూడు పేర్లను తీసుకుంటారు. పార్టీ అభ్యర్ధుల ఎంపికలో ఆర్ఎస్ఎస్(RSS)అభిప్రాయం కూడా కీలకంగా మారనుంది. మొత్తానికి ఈసారి అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ దశలవారీగా పటిష్టంగా ఉండనుంది. 


Also read: Clean Andhra prdesh: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని భారీగా ప్రారంభించిన వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook