BJP MLA Jailed for 5 Years: ఫేక్ సర్టిఫికేట్స్ తో ఓ కాలేజీలో అడ్మిషన్ పొందిన నేరం కింద భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చివరికి జైలు పాలయ్యాడు. నకిలీ మార్క్స్ లిస్టుతో కాలేజీలో చేరిన ఆరోపణలతో ఆ ఎమ్మెల్యేపై ప్రత్యేక కోర్టు విచారణ జరపి.. అతడిపై అనర్హత వేటు వేయడం సహా ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


ఉత్తరప్రదేశ్‌లోని గోసాయ్‌గంజ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్‌ అలియాస్‌ ఖబ్బు తివారీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BJP తరఫున గెలుపొందారు. అయితే.. ఆయన గతంలో ఫేక్ మార్క్స్ లిస్ట్ తో స్థానికంగా ఉండే ఓ కాలేజీలో అడ్మిషన్‌ తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.


దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం.. ఆరోపణలు నిజమేనని తేల్చింది. ఇంద్రప్రతాప్ ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా పేర్కొంటూ.. ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో ఇంద్రప్రతాప్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.


 Also Read: Death Threat to Mayor: నువ్వు దాదాతో చెలగాటం ఆడుతున్నావ్.. ఖబడ్దార్! మేయర్‌‌కు బెదిరింపులు


Also Read: Rape: 13 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల టీనేజర్ అత్యాచారం-ఫార్మసీ షాపులో అఘాయిత్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook