Rape: 13 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల టీనేజర్ అత్యాచారం-ఫార్మసీ షాపులో అఘాయిత్యం

Minor girl raped by teenager in Uttar Pradesh: యూపీలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. కోచింగ్ క్లాస్ నుంచి తిరిగొస్తున్న ఓ బాలికపై టీనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 06:00 PM IST
  • యూపీలో వెలుగులోకి మరో దారుణం
  • 13 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల టీనేజర్ అత్యాచారం
  • ఫార్మసీ షాపులో అఘాయిత్యానికి పాల్పడిన బాలుడు
Rape: 13 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల టీనేజర్ అత్యాచారం-ఫార్మసీ షాపులో అఘాయిత్యం

Minor girl raped by teenager in Uttar Pradesh: మహిళలపై అత్యాచారాలు, నేరాలతో ఉత్తరప్రదేశ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. బరేలీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల టీనేజ్ (Girl Raped by Minor Boy) బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కోచింగ్ క్లాస్ నుంచి తిరిగొస్తుండగా ఆ బాలుడు ఆమెతో మాటలు కలిపాడు. తమ కుటుంబం నిర్వహించే ఫార్మసీ షాపుకు బాలికను తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

కోచింగ్ క్లాసుకు (Coaching Class) వెళ్లిన కుమార్తె చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పలుచోట్ల బాలిక ఆచూకీ గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో కొంతమంది... బాలికను చివరిసారిగా మెడికల్ స్టోర్ వద్ద చూసినట్లు చెప్పారు. దీంతో ఆమె తండ్రి మెడికల్ స్టోర్ వద్దకు వెళ్లాడు. షాపు మూసేసి ఉన్నప్పటికీ... లోపల లైట్లు వెలుగుతుండటం గమనించాడు. షాపు షట్టర్‌పై చేతితో తట్టగా... లోపలి నుంచి బాలుడు షట్టర్ ఓపెన్ చేశాడు.

ఆ సమయంలో లోపలికి తొంగి చూడగా... అక్కడ తన కూతురు అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నిందితుడిపై ఫిర్యాదు చేశాడు. ఇంతలో బాలుడి సోదరులు షాపు వద్దకు వచ్చి బాధిత బాలిక తండ్రితో గొడవకు దిగారు. ఇరువురి మధ్య గొడవ జరుగుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాన్పూర్‌లో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం :

రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మూడేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. చిన్నారి ఇంటి పక్కనే ఉండే ఆ బాలుడు ఆడుకుందామని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారికి అశ్లీల వీడియో చూపించి... ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం అవడంతో.. వెంటనే ఆమెను ఇంటి బయటకు విసిరేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిపై కేసు (Pocso Act) నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read: మా నాన్నే నా హీరో.. బెస్ట్ ఫ్రెండ్... లిద్దర్ శవపేటిక వద్ద కన్నీటిపర్యంతమైన కుమార్తె

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News