BJP MP Gautam Gambhir self isolated: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు వరకు అందరూ కూడా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ (Delhi ) లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో నిత్యం 6 వేలకు పైగా కేసులు నమోదవుతన్నాయి. అయితే ఈ మహమ్మారి ప్రభావంతో మాజీ క్రికెట‌ర్, భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) ఎంపీ గౌతం గంభీర్ ( MP Gautam Gambhir ) ఐసోలేషన్‌లోకి వెళ్లారు. గంభీర్ నివాస భవనంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు ఆయన శుక్రవారం ట్వీట్ చేసి వెల్లడించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన నివాస భవనంలో ఒకరికి కరోనా సోకడంతో.. తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్లానని.. కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నానని గంభీర్ ట్విట్‌లో రాశారు. అయితే ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని.. ఈ మహమ్మారిని ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని ఎంపీ గౌతం గంభీర్ అందరికీ సూచించారు. Also read: Delhi: కోవిడ్ 19 థర్డ్ వేవ్ ప్రారంభం


ఇదిలాఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్ర‌తి రోజు 6 వేల‌కుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులను వినియోగించకుండా ఢిల్లీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. Also read: Covid-19: భారత విమాన సర్వీసులను రద్దు చేసిన చైనా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe