Pegusus spyware: పెగసస్ స్పైవేర్ రోజురోజుకూ వివాదాస్పదమవుతుండటంతో బీజేపీ స్పందించింది. పెగసస్ స్పైవేర్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలు అన్నీ నిరాధారమైనవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇజ్రాయిల్ కంపెనీ అభివృద్ధి పెగసస్ స్పైవేర్(Pegasus Spyware) ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఇండియాలో ఈ సాఫ్ట్‌వేర్‌పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. పెగసస్ స్పైవేర్ అనేది భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపధ్యంలో దేశంలో ప్రతిపక్షాలు ఓ అస్త్రంగా మల్చుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament monsoon session)పెగసస్ స్పైవేర్ అంశంపై ఆందోళన చేపట్టాయి. ఇప్పుడీ వ్యవహారంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. 


పెగసస్ స్పైవేర్‌పై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని జేపీ నడ్డా (JP Nadda)తెలిపారు.ప్రజలకు సంబంధించిన అంశాలు లేక..ఇటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నాయని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కల్గించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు లేవెనత్తుతున్నవన్నీ అసలు అంశాలే కావని చెప్పారు. ఏం చేయాలో తెలియకే..ఇలా పార్లమెంట్‌లో అవాంతరాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్ చేశారు. హ్యాకింగ్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(Joint parliamentary committee)తో విచారణ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని కోరారు. 


Also read: Rockslide: హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడి 9 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook