BJP spokesperson Syed Shahnawaz Hussain tests COVID-19 positive: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, నితిన్ గడ్కరి, పలువురు కేంద్రమంత్రులు కరోనా బారిన పడి  కోలుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అధికార పార్టీ బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ (Syed Shahnawaz Hussain ) కరోనా బారిన పడ్డారు. తాను ఇటీవల కరోనా పాజిటివ్ వ్యక్తులను కలిశానని.. ఆతర్వాత పరీక్ష చేయించుకోగా బుధవారం కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు షానవాజ్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లోని ట్రామా సెంటర్‌లో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. Also read: EC notice to Kamal Nath: కమల్ నాథ్‌కి ఈసి 48 గంటల డెడ్‌లైన్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కరోనా పాజిటివ్ వ్యక్తులను కలవడం వల్లనే తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వ్యక్తులందరూ.. కోవిడ్ మార్గర్శకాల ప్రకారం క్వారంటైన్‌లో ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఎయిమ్స్‌లోని ట్రామా సెంటర్‌లో చేరి చికిత్స పొందుతున్నానని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ట్విట్ చేశారు. 


 Also read : Naini Narsimha Reddy's death: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe