న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ ఆరోగ్య శాఖా మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోమవారం ఎన్నుకోబడ్డారు. ఈ ఎన్నికకు గాను 21 రాష్ట్ర యూనిట్లు, పార్లమెంటరీ పార్టీల బలమైన మద్దతుతో ఎన్నికయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈ పదవిని జేపి నడ్డా స్వీకరించబోయేముందు ఐదున్నర సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ జనతా పార్టీ పూర్తిగా అధికారంలోకి రాని రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఆయా రాష్ట్రాలపై పట్టు కోసం అఖండమైన విజయాలను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటుందని 59 ఏళ్ల నూతన అధ్యక్షుడు జేపి నడ్డా తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో  ప్రసంగిస్తూ.. బీజేపీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయవలిసిన అవసరం ఉందని, పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి పార్టీ కార్యకర్తలందరితో రాత్రి పగలు కలిసి పని చేస్తానని అన్నారు. 


జేపి నడ్డా మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని, దేశంలో ఇంకా చాలా రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా అధికారం లోకి రానటువంటి రాష్ట్రాలున్నాయని, మా తదుపరి లక్ష్యం ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమేనని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. పోటీ ఆప్ బీజేపీ మధ్యే ఉంటుందని, ఢిల్లీ ప్రజలనుండి రోజురోజుకు మద్దతు పెరుగుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా నేతృత్వంలోని టీఎంసీ సర్కారు ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, బెంగాల్ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు గత పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతమైన  ఫలితాలు అందించారని, 2023లో పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..