BJP Workers Blocked PM Modi in Punjab Congress leader Mallikarjun Kharge Tweets a Video: తాజాగా పంజాబ్‌ పర్యటనలో ప్రధాని మోదీకి నిరసనసెగ తగిలిన విషయం తెలిసిందే. ఫిరోజ్‌పూర్ సభలో ప్రసంగించేందుకు వెళ్తున్న ప్రధానిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు మోదీ కాన్వాయ్‌ (Modi convoy) ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు (Airport) వెళ్లిపోయారు. అయితే దీనిపై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ (Punjab CM Charanjit Singh) స్పందించిన విషయం తెలిసిందే. ప్రధాని భద్రతా చర్యల్లో (Prime Minister security) ఎలాంటి లోపం లేదని ఆయన తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనకు సంబంధించి తాజాగా ఒక వీడియోను బయటపెట్టింది కాంగ్రెస్. (Congress) ఈ వీడియోలో ప్రధాని మోదీ కాన్వాయ్‌ (Prime Minister Modi convoy‌) సమీపంలో కొందరు బీజేపీ కార్యకర్తలు (BJP activists) గుమిగూడారు. 


ప్రధాని మోదీ కాన్వాయ్‌ పక్కనే కొందరు బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండా పట్టుకుని ఉండడం ఈ వీడియోలో ఉంది. అలాగే బీజేపీ (BJP) జిందాబాద్‌ అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ప్రధాని కాన్వాయ్‌కు దగ్గరగా వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. వారంతా కాన్వాయ్‌ దగ్గరకు వస్తుండడంతో పీఎం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (PM Special Protection Group) కాన్వాయ్‌కు రక్షణ వలయంలా ఏర్పడింది.


ప్రధాని మోదీ పర్యటనకు బీజేపీ కార్యకర్తలే ఆటంకం కలిగించారంటూ కాంగ్రెస్ (Congress) నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. మోదీ భద్రతకు బీజేపీ కార్యకర్తలు ఆటకం కలిగించారంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. 


బీజేపీ కార్యకర్తల తీరుపై ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని భద్రతకు, దేశ భద్రత‌కు బీజేపీ కార్యకర్తలు ముప్పుగా మారారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే (Congress leader Mallikarjun Kharge) పేర్కొన్నారు.



 


Also Read : AP PRC: ఏపీ ప్రభుత్వం గుడ్​ న్యూస్​- ఉద్యోగులకు పీఆర్​సీ ప్రకటన!


పంజాజ్ పర్యటన సందర్భంగా... ప్రధాని మోదీ.. చరణ్‌జీత్ సింగ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారని, ఈ వీడియోనే అందుకు నిదర్శనమంటూ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇక ప్రధాని పర్యటనలో (PM tour) భద్రతా వైఫల్యంపై (Security failure) విమర్శలు వచ్చిన నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం (Punjab Government) దీనిపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు సాగిస్తోంది.


Also Read : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు! క్వారంటైన్‌ తప్పనిసరి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి