Blood Letter To Modi: ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ... ఎవరు, ఎందుకు రాశారంటే...
Karnataka PSI Scam: కర్ణాటకలో పీఎస్సై రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేయడం అభ్యర్థులను తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు.
Karnataka PSI Scam: కర్ణాటకలో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షలో అవకతవకలు జరగడం సంచలనం రేపుతోంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లే అభ్యర్థుల మాల్‌ప్రాక్టీస్‌కు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం పీఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు అభ్యర్థులు ఏకంగా రక్తంతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఎంతో కష్టపడి చదివి పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ప్రభుత్వ నిర్ణయంతో అన్యాయం జరుగుతోందని లేఖలో ఆ అభ్యర్థులు పేర్కొన్నారు. అవకతవకలకు పాల్పడినవారిపై చర్య తీసుకోవడం సరైనదేనని.. అయిందే ఇందుకోసం నిజాయితీగా పరీక్ష రాసి ఉత్తీర్ణులైనవారిని బలిచేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని... ఒకవేళ న్యాయం జరగనిపక్షంలో తాము మావోయిస్టులతో చేతులు కలపాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ లేఖ బెల్గావి జిల్లాకు చెందిన శ్రీశైల మిత్తరంగి అనే వ్యక్తి రాశాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఓ రైతు బిడ్డనైన తాను కష్టపడి డిగ్రీ చదివి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్లు అందులో పేర్కొన్నాడని చెబుతున్నారు. 2021లో తాను సివిల్స్ పరీక్ష రాశానని... ఆ తర్వాత పీఎస్సై పరీక్ష రాశానని... ఇప్పుడు జరగుతున్నది చూస్తుంటే... ప్రభుత్వ ఉద్యోగాలు డబ్బున్నవారికే తప్ప ప్రతిభ ఉన్నవారికి కాదనే అభిప్రాయం కలుగుతోందని అతను పేర్కొన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం పీఎస్సై పరీక్షను రద్దు చేయడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని అతను వాపోయాడంటున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్కామ్ ఇలా వెలుగులోకి :
కర్ణాటకలోని కలబుర్గి జిల్లాకు చెందిన ఓ అభ్యర్థికి పీఎస్సై రిక్రూట్‌మెంట్‌లోని ఒక పరీక్షలో 100కి 100 మార్కులు వచ్చాయి. కేవలం 21 ప్రశ్నలకే సమాధానాలు రాసిన అతనికి 100 మార్కులు వచ్చినట్లు వెల్లడైంది. అలా ఈ స్కామ్ బయటపడగా... ఇప్పటివరకూ 55 మందిని అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ స్కామ్‌లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.80 లక్షల వరకు లంచంగా తీసుకున్నట్లు తేలింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ శాంత కుమార్‌ను గతవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ఎస్సై రిక్రూట్‌మెంట్ విభాగంలో పనిచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook