గువహటి: చైనాలోని గాంగ్జో నుంచి మెడికల్ గూడ్స్ సహా 50,000 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్స్‌ను తీసుకొచ్చిన బ్లూ డార్ట్ ఎయిర్ కార్గొ విమానం కొద్దిసేపటి క్రితమే అస్సాంలోని గువహటికి చేరుకుంది. గువహటిలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్స్ సహా మెడికల్ గూడ్స్ డెలివరీ చేసిన అనంతరం కార్గొ విమానం గువహటి నుంచి కోల్‌కతాకు వెళ్లనుంది. కోల్‌కతాలో మెడికల్ గూడ్స్ డెలివరీ చేసిన అనంతరం అక్కడి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనుందని అస్సాం వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Lockdown worries:భారతీయులను కరోనా కంటే ఎక్కువ వేధిస్తున్న అంశాలివే


కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, అత్యవసర సేవల నిమిత్తం కార్గొ విమానాలు, ఎయిర్ అంబులెన్సులు, ప్రత్యేక విమానాల రాకపోకలకు సందర్భానుసారం అనుమతి ఇవ్వనున్నట్టు సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ (DGCA) సైతం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే డీజీసీఎ నుంచి ప్రత్యేకంగా అనుమతి మంజూరైన అనంతరమే బ్లూ డార్ట్ కొరియర్ సంస్థకు చెందినఈ కార్గొ విమానం చైనా నుంచి మెడికల్ గూడ్స్ తీసుకొచ్చినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..