BMW: ఆ బైక్ ధర 20 లక్షలే
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త బైక్ ఇప్పుడు సంచలనమౌతోంది. జర్మన్ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ ( BMW ) విడుదల చేసిన ఆ బైక్ అంత ఖరీదు ఎందుకుంది? ప్రత్యేకతలేంటి?
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త బైక్ ఇప్పుడు సంచలనమౌతోంది. జర్మన్ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ ( BMW ) విడుదల చేసిన ఆ బైక్ అంత ఖరీదు ఎందుకుంది? ప్రత్యేకతలేంటి?
అక్షరాలా 20 లక్షల రూపాయలకు పై మాటే ఆ బైక్ ధర. ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ( Luxury cars company) గా ప్రాచుర్యం పొందిన బీఎండబ్ల్యూ ( BMW ) భారత మార్కెట్లో విడుదల చేసింది ఈ బైక్ ను. బీఎండబ్ల్యూ ఎస్-1000 ఎక్స్ ఆర్ ( BMW S-1000 XR ) పేరుతో ఈ బైక్ విడుదలైంది. అడ్వంచర్ కేటగరీలో విడుదలైన ఈ బైక్ ధరను 20.9 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. జూలై 16 నుంచి కంప్లీట్ బిల్డ్ అప్ యూనిట్ గా బైక్ ను ఆర్డర్ చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. Also read: Aadhaar Download: మీ E- Aadhaar Cardను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఇంతగా ధర ఉన్న ఈ బైక్ ప్రత్యేకతలేంటనేది తెలుసుకుందాం. 999 సీసీతో 4 సిలెండర్ ఇన్ లైన్ ఇంజన్ తో ఈ బైక్ నడుస్తుంది. 11 వేల ఆర్ పీఎం తో 165 హెచ్ పీను ఉత్పత్తి చేస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలో అందుకోవడం దీని ప్రత్యేకత. గంటకు మ్యాగ్జిమమ్ దీని వేగం 2 వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలగడం.
[[{"fid":"187842","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BMW S-1000 XR","field_file_image_title_text[und][0][value]":"మార్కెట్ లో విడుదలైన బీఎండబ్ల్యూ కొత్త బైక్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BMW S-1000 XR","field_file_image_title_text[und][0][value]":"మార్కెట్ లో విడుదలైన బీఎండబ్ల్యూ కొత్త బైక్"}},"link_text":false,"attributes":{"alt":"BMW S-1000 XR","title":"మార్కెట్ లో విడుదలైన బీఎండబ్ల్యూ కొత్త బైక్","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈ బైక్ కు ఉన్న కొత్త సస్పెన్షన్ సిస్టమ్, రైడింగ్ డైనమిక్స్ ఇంజనీరింగ్, ఎర్గోనామిక్స్ తో ఆశ్చర్యపరిచే పనితీరు కనబరుస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ( BMW Group India ) యాక్టింగ్ ప్రెసిడెంట్ అర్లిండో టీక్సీరా తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గా అందిస్తున్న డైనమిక్ బ్రేక్ అసిస్టెంట్ డీబీసీ ( డైనమిక్ బ్రేక్ కంట్రోల్ ) తో విన్యాసాలు చేసేటప్పుడు రైడర్ కు మద్దతు లభిస్తుందన్నారు. Also read: Social Distancing: సోషల్ డిస్టెన్సింగ్..బంధాల మధ్య డిస్టెన్సింగ్ కాదు
Follow us on twitter: