BOB Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ ఉంటే బ్యాంకు జాబ్ మీదే.. ఎలా అప్లే చేయాలంటే..?
నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ శుభవార్త చెప్పింది. ఇందులో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగ అర్హతలు.. వయసు.. అప్లై విధానాల గురించి మరింత వివరాలు..
BOB Recruitment 2023: ప్రస్తుతం యువతలో చాలా మంది బ్యాంకు ఉద్యోగాలను సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు అదిరిపోయే న్యూస్ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అందులో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పంపాలని ప్రకటించింది. అందులో మొత్తం 20 రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్, డిప్యూటీ రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు 14, 2023 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ లో దరఖాస్తును పంపాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు కనీసం ఏదైనా యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్ట్ గ్రాడ్యూయేషన్ (పీజీ) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 14 నాటికి 45 ఏళ్ల మించకూడదు. రిజర్వేషన్స్ కు కట్టుబడి అభ్యర్థులకు వయోపరిమితిని సడలింపు ఇస్తారు.
అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగానికి ఎంపికైన వారు దేశంలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
ఎంపిక చేసే విధానం..
> రాత పరీక్ష
> ఇంటర్వ్యూ
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: సెప్టెంబరు 4, 2023.
దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేది: 14 సెప్టెంబర్ 2023
అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రిక్రూట్మెంట్ లో పోస్టులను పెంచారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు జాబ్ నోటిఫికేషన్ ను బాగా చదివి తెలుసుకోగలరు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
Also Read: Chandrababu Arrest Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, కేసు పరిణామాలిలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook