Actress Swara Bhasker joins Rahul Gandhis Bharat Jodo Yatra at Madhya Pradhesh: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొనసాగుతోంది. ఈ జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3,570 కిలోమీటర్లు నడిచేలా రాహుల్‌ గాంధీ ప్రణాళిక రూపొందించారు. సెప్టెంబరు 7న ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా సాగింది. ఇంకా 1209 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. భారతదేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ యాత్ర గురువారం నాడు 83వ రోజు పూర్తిచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుల్‌ గాంధీ మొదలుపెట్టిన భారత్‌ జోడో యాత్రకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటి స్వరా భాస్కర్‌ పాల్గొన్నారు. ఉజ్జయినిలో రాహుల్ గాంధీ వెంట స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో నడిచారు. రాహుల్‌తో కలిసి ఆమె కాసేపు నడుస్తూ ముచ్చటించారు. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై రాహుల్‌కు స్వరా రోజాపూలు ఇచ్చి ప్రశంసించారు. ఇందుకు సంబందించిన ఫొటోలను కాంగ్రెస్‌  తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. 



రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూనమ్‌ కౌర్‌, పూజా భట్, రియా సేన్, మోనా అంబేగావ్కర్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరీ పాదయాత్రలో పాల్గొన్నారు. హాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ కుసాక్‌ కూడా రాహుల్‌కు ట్విటర్‌ వేదికగా మద్దతు ప్రకటించారు. భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది.


Also Read: Horoscope Today 2 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు!  


Also Read: Drishyam Scenes: దృశ్యం సినిమా రిపీట్.. లవర్తో కలిసి భర్తను ఇంట్లోనే పూడ్చిన భార్య!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook