Kangana Ranaut As MP Candidate: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ టికెట్.. ఆ రాష్ట్రం నుంచి పోటీ..
Kangana Ranaut As MP Candidate: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఐదో లిస్టులో కంగనాకు చోటు దక్కింది.
Kangana Ranaut As MP Candidate: మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు మంచి సంబంధమే ఉంది. సినిమా నటులు రాజకీయాల్లో రావడమే కాదు.. ఎంపీగా..ఎమ్మెల్యేగా పోటీ చేయడమనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు సినిమా నటీనటులను ఎంపీలుగా పోటీ చేయిస్తున్నారు. ఈ కోవలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్‌కు భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ ఖరారు చేసింది. 2024 భారత దేశంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల పలు విడతల్లో ప్రకటించాయి. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పలువురు హీరోయిన్స్ తొలిసారి తమ లక్‌ను పరీక్షంచుకుంటున్నారు. ఇప్పటికే పశ్చిమ బంగలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 40 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి సంచలనం రేపారు. ఇందులో బాలయ్య, చిరంజీవిలతో నటించిన రచన బెనర్జీ ఉన్నారు.ఈమె హుగ్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు.
అటు తమిళనాడు నుంచి విరుధ్ నగర్ నుంచి రాధిక శరత్ కుమార్ ఎంపీగా బరిలో దిగనున్నారు. అటు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పరిచయమైన 'చిరుత' సినిమాతో పరిచయమైన నేహా శర్మ కూడా ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో తన లక్‌ను పరీక్షించబోతున్నారు. ఈమె బిహార్‌లోని 'భాగల్ పూర్' నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా బరిలో దిగబోతున్నట్టు సమాచారం.
అటు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్ సభ స్థానం కేటాయించింది. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. గత కొన్నేళ్లుగా కంగనా .. బీజేపీ టికెట్ ఆఫర్ చేస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెబుతూ వచ్చింది. ఈ కోవలో ఈ సారి ఎన్నికల్లో కంగనా సొంత రాష్ట్రంలోని సొంత ప్రదేశంలోనే ఎంపీ టికెట్ కేటాయించడం విశేషం. కంగనా కూడా ఇదే లోక్‌సభ నియోజకవర్గంలో పుట్టి పెరిగింది. తొలిసారి కంగనా ఎన్నికల బరిలో దిగబోతుంది.
కంగనా సినిమాల విషయానికొస్తే.. 2006లో అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ స్టర్' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. ఈమెకు బిగ్ బ్రేక్ ఇచ్చిన చిత్రం 'క్వీన్'. అంతకు ముందు 'ఫ్యాషన్' చిత్రంలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది. ఆ తర్వాత 'తను వెడ్స్ మను', తను వెడ్స్ మను రిటర్న్స్', పంగా, మణికర్ణిక, తేజస్ చిత్రాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.ఒకసారి సహాయ నటిగా జాతీయ అవార్డు .. మొత్తంగా నాలుగు నేషనల్ అవార్డులు అందుకున్న ఈ తరం నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా. త్వరలో ఈమె 'ఎమర్జెన్సీ' సినిమాతో పలకరించబోతుంది. ఇందులో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. నటిగా.. నిర్మాతగా, దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు 2020లో పద్మశ్రీతో గౌరవించింది. ఈమె తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన 'ఏక్ నిరంజన్' సినిమాలో నటించింది. రీసెంట్‌గా తమిళంలో 'చంద్రముఖి 2' కూడా మెరిసింది.
Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook