Bombay High Court: మహిళల వస్త్రధారణ అంశమై ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. రోజురోజుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కారణం కూడా ఆ వస్త్రధారణేనని చెప్పేవారికి బోంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇలాంటివారికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అన్నీ ఇన్నీ కావు. మహిళలపై జరిగే వివిధ అఘాయిత్యాలకు వస్త్రధారణే కారణమని వాదించేవాళ్లున్నారు. వస్త్రధారణను బట్టి అశ్లీలత ఉంటుందని, అందుకే ఈ అత్యాచారాలని తప్పించుకునే ప్రయత్నం చేసేవాళ్లున్నారు. ఈ తరహా వ్యక్తులకు షాకిచ్చే తీర్పునిచ్చింది బోంబే హైకోర్టు. మహారాష్ట్ర నాగపూర్‌లోని రెండు రిసార్టులపై పోలీసులు చేసిన దాడుల్లో మహిళల అరెస్టుకు సంబంధించిన కేసులో విచారణ సందర్బంగా బోంబే హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో పొట్టి పొట్టి స్కర్ట్‌లు వేసుకుని అశ్లీలంగా డ్యాన్సులు వేశారనేది ఆరుగురు మహిళలపై పోలీసులు మోపిన అభియోగం. పొట్టి పొట్టి డ్రెస్సులతో అశ్లీలంగా కన్పిస్తూ రెచ్చగొట్టే విధంగా డ్యాన్స్ చేశారని పోలీసులు ఆరోపించారు. 


ఈ ఘటనలో మహిళలు అశ్లీలంగా డ్యాన్సులు వేస్తుంటే కొంతమంది మద్యం సేవిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనను అశ్లీలతగా పరగణించి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బోంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది. పొట్టి బట్టలు వేసుకుని రిసార్టుల్లో డ్యాన్స్ లు చేయడాన్ని అశ్లీలతగా పరిగణించలేమని నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో జరిగితే మాత్రం నేరంగా పరగిణించవచ్చని తెలిపింది. ఈ కేసులో పేర్కొన్న రిసార్ట్‌లు, బ్యాంకెట్ హాల్‌లు బహిరంగ ప్రదేశాలు కావని తేల్చింది. వీటివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేసినా కేసు నమోదుచేయవచ్చని నాగ్‌పూర్ బెంచ్ కోర్టు తెలిపింది. 


పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నంతమాత్రాన అశ్లీలతగా పరగిణించలేమని బోంబే హైకోర్టు అభిప్రాయపడింది. పొట్టి డ్రెస్సులు వేసుకుని డ్యాన్సులు చేయడం అశ్లీలత కిందకు రాదని కూడా తేల్చి చెప్పింది.


Also read: Chhattisgarh High Court: భార్యాభర్తలైనా ఫోన్ రికార్డింగ్ తప్పే, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook