Ayodhya Ram Mandir Inauration: అయోధ్య రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ఘట్టం కనుల పండుగగా ముగిసింది. దేశమంతట కూడా రామనామ స్మరణతో మారుమోగిపోయింది. దాదాపు ఐదువందల ఏళ్లుగా రాముడి ఆలయంను తిరిగి పున: ప్రతిష్టించాలన్న ఎందరో కలను మనదేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా సాకారం అయ్యింది. ఈ పవిత్ర ఉత్సవానికి అనేక రంగాలలోని ప్రముఖులు హజరయ్యారు. అదే విధంగా వీఐపీలు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా అనేక మందికి భవ్యరామమందిరం ఆలయం ప్రారంభోత్సవానికి రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాలు అందించిన విషయం తెలిసిందే. అయితే.. పవిత్రమైన రామ్ లల్లా  ప్రతిష్టాపన వేడుక కార్యక్రమం నిన్న (జనవరి 22) సోమవారం నాడు కన్నుల పండుగగా సాగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. మన దేశంలో ఎందరో మహిళలు పవిత్రమైన రామలల్లా విగ్రహం ప్రతిష్టాపన రోజు పిల్లలకు జన్మనివ్వడానికి ఆసక్తిచూపించారు. అదే విధంగా జనవరి 22న పిల్లలకు జన్మనిస్తే రాముడంతటి గొప్పవాడు, రాముడి గుణగణాల పోలికలతో పుడతారని చెబుతుంటారు. అందుకే ఆరోజు ఎందరో ప్రెగ్నెంట్ మహిళలు తల్లులుకావాలని ఇంట్రెస్ట్ చూపించారు. అంతే కాకుండా డాక్టర్లను సైతం కలిసి అదేరోజు సీజేరియన్ సైతం చేయాలని కోరుకున్నట్లు అనేక వార్తలోచ్చాయి.


అయితే నిన్న పవిత్రమైన భవ్యరామందిర ఉత్సవం వైభవంగా ముగిసింది. ఈ క్రమంలో అయోధ్యలోని ఫిరోజాబాద్ లో ఒక ముస్లిం ఫ్యామిలీ మతసామరస్యాన్ని చాటుకుంది. మరోసారి పవిత్రమైన రామజన్మభూమి ప్రారంభోత్సవేల.. భిన్నత్వంలో ఏకత్వంను చాటిచెప్పేలా వీరు చేసిన పని ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.  



యూపీలోని ఫిరోజాబాద్ కు చెందిన ఫర్జానా అనే ముస్లిం మహిళ రామ్ లల్లా ప్రతిష్టాపన రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డ కూడా కూడా ఆరోగ్యంగా ఉన్నారని మహిళా ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డాక్టర్ నవీన్ జైన్ తెలిపారు.  హిందూ-ముస్లింల ఐక్యత సందేశం ఇచ్చేందుకే తమ బిడ్డకు 'రామ్ రహీమ్' అని పేరుపెట్టినట్లు పిల్లవాడి అమ్మమ్మ హుస్నా బాను తెలిపారు.


ఇదిలా ఉండగా.. కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీలో ప్రసూతి,  గైనకాలజీ విభాగానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సీమా ద్వివేది మాట్లాడుతూ సోమవారం ఇక్కడ 25 మంది శిశువులు ప్రసవించారని తెలిపారు. 25 మంది శిశువులలో, 10 మంది బాలికలు కాగా, మిగిలిన వారు అబ్బాయిలు మరియు అందరూ సాధారణంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నత్వంలో ఏకత్వం చాటేలా సమాజానికి మంచి మెస్సెజ్ ఇచ్చిన సదరు ముస్లిం కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు.   


Also Read: Ayodhya: రామనామం కణ కణంలో ఉంది: అయోధ్యలో తన్మయత్వానికి లోనైన ప్రధాని మోదీ


Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఈ విశేషాలు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook