Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదు
Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం సంభవించింది. వేలూరుకు 59 కిలో మీటర్ల దూరంలో సోమవారం (నవంబరు 29) ఉదయం 3.6 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం సంభవించింది. సోమవారం (నవంబరు 29) ఉదయం రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.
వేలూరులోని పశ్చిమ-నైరుతి దిశలోని 59 కిలో మీటర్ల దూరంలో.. 25 కిలో మీటర్ల లోతులో సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించినట్లు కేంద్ర నోడల్ ఏజెన్సీ తెలిపింది.
ప్రాణ నష్టం జరగలేదు..
అయితే ప్రస్తుతం నివేదికల ప్రకారం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో వేలూరు నగరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే వేలూరులోని నీటి కుంటలు, చెరువులు పూర్తిగా నిండిపోయాయి.
ముందస్తు జాగ్రత్తలు..
ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగ్గకుండా.. అధికారులు ముందస్తు చర్యలును చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వేరే చోటుకు సురక్షితంగా తరలిస్తున్నారు. వేలూరులోని రాణిపేట, తిరుపత్తూరు జిల్లాలో పాలర్ నది, చెక్ డ్యామ్ లు, లోలెవల్ బ్రిడ్జ్ ల సమీపంలో వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు.
Also Read: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, దేశంలో ఒమిక్రాన్ కలకలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook