Parliament Winter Session: రేపటి నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు- కేంద్రం ప్రవేశపెట్టే కీలక బిల్లులు ఇవే!

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వే సిద్ధమైంది. ఉభయ సభల్లో రేపటి నుంచి కీలక అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం 26 బిల్లులను పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 10:08 PM IST
  • రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
  • ఉభయ సభల ముందుకు కీలక బిల్లులు
  • నూతన సాగు చట్టాల రద్దు అంశంతోనే చర్చలు ప్రారంభం!
Parliament Winter Session: రేపటి నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు- కేంద్రం ప్రవేశపెట్టే కీలక బిల్లులు ఇవే!

Parliament winter session to begin With New three farm laws repealing bill: రేపటి (సోమవారం నవంబర్ 29) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారభం కానున్నాయి. తొలి రోజే పార్లమెంట్​ ముందుకు నూతన సాగు చట్టాల రద్దు బిల్లు వచ్చే (New Farm laws repealing bill) అవకాశముంది.

శీతాకాల సమావేశాలు మొత్తం 20 రోజులు పని చేయనున్నాయి. ఇందులో కేంద్రం మొత్తం 26 బిల్లులను (Parliament winter session Bills) ప్రవేశపెట్టనుంది. దీనితో కీలక బిల్లులను ఎలాంటి ఆటంకం లేకుడా ఆమోదింపజేుకునేందుకు.. అధికార బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసిది. ప్రతి ఒక్కరు సెషన్లకు తప్పకుండా హాజరు కావాలని అందులో పేర్కొంది.

కీలక బిల్లులు ఇవే?

నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుతో పాటు.. ఈ సారి శీతాకాల సెషన్​లో (Parliament winter session First Bill) తొలి బిల్లు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్​ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. పార్లమెంట్​లో ఈ బిల్లును వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ ప్రవేశపెట్టనున్నారు.

అయితే ఈ బిల్లుపై ప్రతి పక్షాలు సానుకూలంగా స్పందించినా.. పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) విషయంపై ప్రతిపక్షలా పట్టుబడ్డే అవకాశముంది.

సాగు చట్టాల వివాదం..

గత ఏడాది కొత్త సాగు చట్టాలనును తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఈ చట్టాలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవి కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయని.. వ్యవసాయ రంగం ప్రమాదంలో పడుతుందని ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాది పాటు ఆందోళనలు చేపట్టగా..ఇటీవలే కేంద్రం దిగొచ్చింది.

స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi).. కొత్త సాగు చట్టాలను రద్దు ఉపసంహరించుకుంటున్నట్లు గురునానక్ జయంతి సందర్భంగా వెల్లడించారు. దీన్ని విపక్షాలు కూడా స్వాగతించాయి.

ఇదిలా ఉండగా.. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలను అమలు చేయకుండా ఈ ఏడాది జనవరిలో స్టే విధించింది సుప్రీం కోర్టు.

రైతులు ఢిల్లీలో చేపట్టిన ఆందోళన హింసకు దారి తీయడం mue. యూపీలో కేంద్ర మంత్రి కుమారుడి వాహనం రైతులపైకి దూసుకెళ్లడం వరకు సాగు చట్టాల అంశం వివాదాస్పదమైంది.

మరిన్ని బిల్లులు ఇవే..

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం వాటాను తగ్గించుకునేందకు వీలు కల్పించే ఓ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. దీనితో పాటు క్రిప్టో కరెన్సీల నియంత్రణకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ముందుకు రానుంది.

సుప్రీం కోర్టు జడ్జీల సర్వీసు నిబంధనలు, వేతనాలు సవరణ బిల్లు- 2021, మనుషుల అక్రమ రవాణా నిరోధం, రక్షణ, పునరావాసం బిల్లు 2021 కూడా పార్లమెంట్‌లో (Parliament winter session Bills) ప్రవేశ పెట్టనుంది కేంద్రం.

Also read: International Flights: అంతర్జాతీయ విమాన సేవలపై కేంద్రం పునరాలోచన.. కారణం ఇదే!

Also read: Drones : మన డ్రోనులు మందులకు.. పాక్ డ్రోన్‌లు వాటికోసం : కేంద్ర మంత్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News