Jammu Kashmir: ఉగ్రవాదులతో కాల్పులు, ముగ్గురు జవాన్ల మృతి
జమ్ము కశ్మీర్ లో మరోసారి భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈసారి భారత జవాన్లకు ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో ముగ్గురు భారతీయ సైనికులు అమరులయ్యారు.
జమ్ము కశ్మీర్ ( Jammu kashmir ) లో మరోసారి భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈసారి భారత జవాన్లకు ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో ముగ్గురు భారతీయ సైనికులు అమరులయ్యారు.
జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు తరచూ ఎదురుకాల్పులు ( Encounter ) జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరోసారి ఇరువర్గాలు ఎదురెదురై కాల్పులు జరిపాయి. కుప్వారా జిల్లాలో ( Kupwara district ) జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారతీయ సైనికులు అమరులయ్యారు. భారత ఆర్మీకు ( Indian Army ) చెందిన ఇద్దరు సైనికులు, బీఎస్ఎఫ్ కు చెందిన ఒక సైనికుడు మరణించారు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా లైన్ ఆఫ్ కంట్రోల్ కు సమీపంలోని మాచిల్ సెక్టార్ వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలున్నాయనే సమాచారంతో..పెట్రోలింగ్ బలగాలు నిఘా ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు భారతీయ సైనికులు ప్రాణాలు బలయ్యాయి. అటు ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. Also read: Shiv sena vs BJP: అర్నాబ్ వ్యవహారంలో బీజేపీ వర్సెస్ శివసేన