BSF Jawan entered Pakistan: ఇండియా, పాకిస్థాన్ మధ్య బార్డర్ లైన్‌లో పెట్రోలింగ్ నిర్వహించే క్రమంలో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్‌కి చెందిన ఒక సైనికుడు అనుకోకుండా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన ఘటన ఇవాళ ఉదయం అబోహార్ సెక్టార్‌లోని జిజి బేస్‌లో చోటుచేసుకుంది. బిఎస్ఎఫ్ అధికార వర్గాలు జీ మీడియాకు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం 6.30 గంటలకు దట్టమైన మంచు కురుస్తుండటంతో ఆ పొగ మంచులో సైనికుడు అనుకోకుండా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ దాటి పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టారు. అయితే, బిఎస్ఎఫ్ జవాన్‌ని పాకిస్థాన్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోవడంతో అతడు తిరిగి వచ్చే మార్గం లేకపోయింది. మరోవైపు ఉదయం 9.30 గంటలు అయినప్పటికీ పెట్రోలింగ్‌కి వెళ్లిన తమ సైనికుడు తిరిగి రాకపోవడంతో అతడు తప్పిపోయినట్టు గుర్తించిన బిఎస్ఎఫ్ సైనికులు.. భారత భూభాగంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 


భారత భూభాగంలో సైనికుడి ఆచూకీ లభించకపోవడంతో పాకిస్థాన్ రేంజర్స్‌ని సంప్రదించి తమ సైనికుడిని తిరిగి అప్పగించాల్సిందిగా డిమాండ్ చేశారు. మొదట బిఎస్ఎఫ్ జవాన్ గురించి ఏమీ తెలియనట్టే నాటకమాడిన పాకిస్థాన్ రేంజర్స్.. ఆ తరువాత అతడు తమ ఆధీనంలోనే ఉన్నట్టు నిజం ఒప్పుకున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా పాకిస్థాన్ లోకి ప్రవేశించిన బిఎస్ఎఫ్ జవాన్‌ని తిరిగి భారత్ కి అప్పగించాల్సిందిగా బిఎస్ఎఫ్ సైనికులు, ఉన్నతాధికారులు పాకిస్థాన్ రేంజర్స్‌తో మూడుసార్లు చర్చలు జరిపారు. 


మూడు రౌండ్ల చర్చల అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఫ్లాగ్ మీటింగ్ సందర్భంగా బిఎస్ఎఫ్ జవాన్‌ని పాకిస్థాన్ రేంజర్స్ భారత్‌కి తిరిగి అప్పగించారు. ఇదిలావుంటే ఇండియా, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారితీసిన ఈ ఘటనపై బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ( BSF ) విచారణకు ఆదేశించారు. రక్షణ శాఖ సైతం ఈ ఘటనపై పూర్తి వివరాలు రాబడుతోంది.


Also Read : Gas Cylinder Price: సామాన్య ప్రజలకు ఊరట.. స్థిరంగా గ్యాస్ సిలిండర్ ధర!


Also Read : Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలో మూడవసారి మహిళా ధర్మాసనం, 32 పిటీషన్లపై విచారణ


Also Read : Telangana Medical College: తెలంగాణ మెడికల్‌ కాలేజీల్లో భారీగా పోస్టుల భర్తీ.. ఒక్కో కళాశాలకు 433 పోస్టులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook