LPG Gas Cylinder Price not changed in December 2022: గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ల ధరల్లో దేశంలోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం లేదు. డిసెంబర్ నెలలో కూడా ప్రభుత్వ చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచలేదు. దాంతో పెరుగుతున్న ధరల నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఈ నెలలో మీరు ఎల్‌పీజీ సిలిండర్ ధరను బుక్ చేసుకోవాలనుకుంటే.. మీ నగరంలో 14.2 కిలోల సిలిండర్ ధర ఎంత ఉందో ఓసారి చెక్ చేసుకోండి. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ రోజు దేశీయ గ్యాస్ సిలిండర్లు మరియు వాణిజ్య గ్యాస్ సిలిండర్లలో ఎలాంటి మార్పు లేదు. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.115.50 తగ్గించారు. 6 సార్లు 19 కిలోల సిలిండర్ ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 2022 డిసెంబర్ 1న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1053గా ఉంది. కోల్‌కతాలో రూ.1079, ముంబైలో రూ.1052.50, చెన్నైలో రూ.1068.50గా ఉంది. హైదరాబాద్ నగరంలో రూ.1105 గా ఉంది.
చివరిసారిగా 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను అక్టోబర్ 6న చమురు కంపెనీలు పెంచాయి. అక్టోబరు నెలలో దేశీయ ఎల్‌పీజీ ధరలను రూ.15 పెంచాయి. అంతకుముందు మార్చి 22న రూ.50 పెరిగాయి. ఈ సంవత్సరంలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రెండుసార్లు పెరిగింది. మార్చి, అక్టోబరు నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఇక వచ్చే ఏడాది 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఎలా ఉండనుందో. కొత్త సంవత్సరంలో చమురు కంపెనీలు వినియోగదారులకు తీపి కబురు ఇస్తాయో లేదా షాకిస్తాయో చూడాలి.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర:
# ఢిల్లీ - రూ 1744
# ముంబై - రూ 1696
# చెన్నై - రూ 1891.50
# కోల్‌కతా - రూ 1845.50
# హైదరాబాద్ - రూ 1105
Also Read: Teenamar Mallana: సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే.. నేను అక్కడే చేస్తా: తీన్మార్ మల్లన్న
Also Read: Gujarat Assembly Election 2022: గుజరాత్ తొలి దశ పోలింగ్ నేడే.. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య పోటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.