BSNL Recharge Plans: ప్రైవేట్ టెలీకం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ చౌకగా ఉండటమే కాకుండా చాలా అనుకూలమైన టారిఫ్ రేట్లతో ఉంటున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాపోన్ ఐడియాలు టారిఫ్ పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మరింత క్రేజ్ పెరిగింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఎస్ఎన్ఎల్ 277 ప్లాన్


ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు కొత్త ఏడాది 2025లో మరో ఆఫర్ విడుదల చేసింది. అదే బీఎస్ఎన్ఎల్ 277 ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం 120 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. జనవరి 16 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత టారిఫ్ మారిపోవచ్చు. 


బీఎస్ఎన్ఎల్ 321 ప్లాన్


ఈ ప్లాన్ ఏడాది వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. కేవలం 321 రూపాయలకే 365 రోజులు పనిచేస్తుంది. అంటే రోజుకు 1 రూపాయి కంటే తక్కువ ఖర్చు పెడితే చాలు. ఈ ప్లాన్‌లో 15 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 250 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ప్రస్తుతానికి ఈ ప్లాన్ తమిళనాడు పోలీసులకే అందుబాటులో ఉంది. ఇతరులకు లేదు. ఈ ప్లాన్‌లో నెట్‌వర్క్ ఫోన్ నెంబర్లకు ఏడాది కాలింగ్ ఉచితం. ఇతర నెంబర్లకు కాల్ చేయాలంటే నిమిషానికి 7 పైసలు ఖర్చవుతుంది. ఎస్టీడీ అయితే నిమిషానికి 15 పైసలవుతుంది. 


బీఎస్ఎన్ఎల్ 2399 ప్లాన్


ఇక బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్‌లో ఇదొకటి. ఈ ప్లాన్ 2399 రూపాయలకు ఏకంగా 395 రోజులు వ్యాలిడిటీ ఇస్తుంది. అంటే ఏడాది కంటే మరో నెల అదనం. ఒకసారి రీఛార్జ్ చేస్తే 13 నెలలు పనిచేస్తుంది. అయితే ఇప్పుడీ ప్లాన్ వ్యాలిడిటీని బీఎస్ఎన్ఎల్ మరింతగా పెంచింది. ఏకంగా 425 రోజులు పనిచేస్తుంది. జనవరి 16 వరకూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. 


Also read: Reliance Jio Recharge Plans: డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్ ఇచ్చే బెస్ట్ ప్లాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.