Union Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంటులో 2022 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం స్థిరమైన పన్ను విధానాన్ని కలిగి ఉందని ఆమె అన్నారు. ఐటీ రిటర్న్‌ల దాఖలులో (Income Tax Returns) మరో వెసులుబాటు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంటే రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు. ఈసారి బడ్జెట్ లో ఆదాయపన్ను మినహాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సగటు ఉద్యోగికి నిరాశే మిగిలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాటిపై 30శాతం పన్ను
క్రిప్టో కరెన్సీల (Crypto currency) లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్‌బీఐ ద్వారా త్వరలో డిజిటల్‌ కరెన్సీ (digital Currency) తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీ తీసుకొస్తామన్నారు. డిజిటల్‌ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్సాహం వస్తుందన్నారు నిర్మలా. యానిమేషన్‌ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. 


Also Read: Budget 2022 Live Updates: రానున్న మూడేళ్లలో 4 వందల వందేభారత్ రైళ్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook