Budget 2022: కేంద్ర బడ్జెట్‌పై ఎందరికో ఎన్నో ఆశలున్నాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఇన్సూరెన్స్ రంగానికి పెరిగిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని..బడ్జెట్‌లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి ఉంటుందా, జీవిత బీమా ప్రీమియం ధరలు ఎలా ఉండబోతున్నాయి..ఇదే ఇప్పుడు అందరికీ ఆసక్తి కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి కాస్సేపట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌పై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ఎవరి ఆశలు నెరవేరనున్నాయి, మరెవరివి నీరుగారనున్నాయో కాస్సేపట్లో తేలిపోనుంది. ఈ క్రమంలో జీవిత బీమా రంగం మాత్రం చాలా ఆశలు పెట్టుకుంది. దీనికి కారణం లేకపోలేదు. కరోనా నేపధ్యంలో ఇటీవల కొద్దికాలంగా బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 40 శాతం పెరుగుదల నమోదైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్‌లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి సారించవచ్చనేది సమాచారం. 


ప్రస్తుతం సెక్షన్ 80 సి (Section 80 C) ప్రకారం మినహాయింపు పరిమితి పన్ను మినహాయింపు పరిమితి 1.5 లక్షల వరకే ఉంది. ఇందులోనే ఈపీఎఫ్, వీపీఎఫ్, ఇంటి రుణం అసలు, ట్యూషన్ ఫీజులు, ఎన్ఎస్‌సీ పెట్టుబడులు, జీవిత బీమా ప్రీమియం అన్నీ ఉంటాయి. ఏడాదికి 1.5 లక్షల పరిమితి అంటే ఎటూ సరిపోని పరిస్థితి. ఎందుకంటే ట్యూషన్ ఫీజులే దాదాపుగా ఈ మొత్తాన్ని ఆక్రమించేస్తాయి. అందుకే చాలాకాలంగా జీవిత బీమాను సెక్షన్ 80 సిలో కలపకుండా ప్రత్యేకంగా ఓ సెక్షన్ ఏర్పాటు చేయాలనేది డిమాండ్. లేదా సెక్షన్ 80 సి లో బీమా రిలీఫ్ క్లెయిమ్‌ను పెంచాల్సి ఉంటుంది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో(Budget 2022) టర్మ్ పాలసీ ప్రీమియంలో మినహాయింపు ఉండే అవకాశాలున్నాయి. జీవిత బీమా( Life Insurance) అనేది దీర్ఘకాలిక పరిష్కారమైనందున..ప్రీమియంపై పన్ను మినహాయింపుకు ప్రత్యేక విభాగం ఉండాలనేది ఇన్సూరెన్స్ రంగ నిపుణుల అభిప్రాయంగా ఉంది. బీమా ప్రీమియంపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ ఉంటోంది. అంటే వేయి రూపాయల ప్రీమియంకు 180 రూపాయలు జీఎస్టీ పోతుంది. ఫలితంగా ప్రీమియం మొత్తం పెరుగుతుంది. పాలసీ హోల్డర్లకు ఇది ఓ సమస్యగా మారుతోంది. 


అందుకే బీమా పాలసీలపై జీఎస్టీ (GST) తగ్గిస్తే..ప్రీమియం తగ్గే అవకాశాలున్నాయి. ఫలితంగా దేశంలో బీమారంగం (Insurance Sector) మరింత వృద్ధి చెందేందుకు అవకాశముంటుందనేది నిపుణుల విశ్లేషణ. టర్మ్ ఉత్పత్తులపై జీఎస్టీని హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో బీమా పాలసీలపై అవగాహన పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వ్యాధులు, మరణాల్నించి కుటుంబాల్ని రక్షించుకోవాలని చూస్తున్నారు. ఫలితంగా ప్రీమియం కూడా పెరిగింది. ప్రస్తుతం సెక్షన్ 80 సి ప్రకారం 60 ఏళ్లలోపువారికి 25 వేలు, 60 ఏళ్లు దాటితే 50 వేల వరకూ మినహాయింపు ఉంది. దాంతో 5 లక్షల పాలసీ తీసుకుంటేనే ఫలితముంటుంది. అందుకే 60 ఏళ్లలోపు పరిధిని 50 వేలకు పెంచాలనేది ప్రధాన డిమాండ్‌గా ఉంది. దేశంలో బీమా రంగం ప్రాధాన్యత, వృద్ధిని గమనించి..బడ్జెట్‌లో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలనేది బీమా పరిశ్రమ కోరిక. మరి నిర్మలా సీతారామన్ (Nrmala Sitaraman) బడ్జెట్ ఏం చేస్తుందో చూడాలి.


Also read: Budget 2022: అతి వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా ఇండియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook