Budget 2022 Updates: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ కొనసాగుతోంది. ఇన్‌కంటాక్స్‌, క్రిప్టోకరెన్సీకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం మోపుతూనే డిజిటల్ కరెన్సీపై ప్రకటన చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని వర్గాలపై వరాలు కురిపిస్తున్నారు. మరికొన్ని వర్గాలపై నిబంధనలు కఠినం చేస్తున్నారు. 5 జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాది పూర్తి చేస్తామని గుడ్‌న్యూస్ అందించారు. మరోవైపు దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి, వందే భారత్ రైళ్లు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణంపై కీలక ప్రకటనలు చేశారు. 


ఇక అందరూ ఎదురుచూస్తున్న ఇన్‌కంటాక్స్‌కు (Incometax)సంబంధించి కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత ఏదైనా తప్పిదాలుంటే అసెస్‌మెంట్ ఏడాది ముగిసిన తరువాత మూడు నెలల వరకే అవకాశముండేది. ఇప్పుడా గడువును రెండేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించారు. ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. వైకల్యంతో ఇబ్బంది పడుతున్నవారి తల్లిదండ్రులకు 60 ఏళ్ల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఎన్‌పీఎస్ డిడక్షన్‌ను 10 నుంచి 14 శాతానికి పెంచారు.


క్రిప్టోకరెన్సీపై 30 శాతం ట్యాక్స్, త్వరలో డిజిటల్ రూపీ


ఇక అన్నింటికంటే ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ. క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) ద్వారా అంటే డిజిటల్ అసెట్స్ ద్వారా వచ్చే ఆదాయంపై ఏకంగా 30 శాతం ట్యాక్స్ విధించనున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు డిజిటల్ అసెట్స్ ద్వారా వచ్చే నష్టాన్ని సెటాఫ్ చేసుకునే అవకాశం కూడా లేదని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో దేశీయంగా డిజిటల్ కరెన్సీపై కీలక ప్రకటన చేశారు మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే ఆర్దిక సంవత్సరంలో అంటే 2022-23లో కొత్తగా డిజిటల్ రూపీ (Digital Rupee) ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. బ్లాక్ చైన్, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ డిజిటల్ రూపీ రూపొందించామన్నారు. ఆర్బీఐ ద్వారా కొత్త డిజిటల్ రూపీ జారీ కానుంది. 


Also read: Budget 2022 Live Updates: దేశంలో 5 జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాదిలోనే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook