Budget Expectations: పదేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే ఒక్క పథకం ప్రవేశపెట్టలేకపోయింది. ఈ బడ్జెట్‌లోనైనా ఉంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రజల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ బడ్జెట్‌లో కీలకంగా ఆరు అంశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే అవి దేశ అభివృద్ధికి సంబంధించినవని తెలుస్తోంది. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేవి లేవని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా స్పందించారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కీలక అంశాలు ఉంటాయని చెబుతున్నారు. ఆయన అంచనా ప్రకారం ప్రభుత్వం ప్రధానంగా ఆరు అంశాల మీద దృష్టి సారించే అవకాశం ఉందని తెలిపారు. మరోసారి డిజిటలీకరణ, పర్యావరణ హిత ఉత్పత్తులు వంటి వాటిపై ఉంటుందని అంచనా వేశారు.


ఆరు అంశాలు ఇవే..


  1. డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్‌ వాహనాలు (ఈవీలు), బ్రాడ్‌బ్యాండ్ (ఇంటర్నెట్‌) వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు

  2. ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచుతుందని అంచనా. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యం.

  3. ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు మద్దతునిచ్చే ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది.

  4. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆహారం, ఎరువుల రాయితీల కోసం దాదాపు 4 ట్రిలియన్లు (48 బిలియన్ డాలర్లు) కేటాయించే అవకాశం.

  5. వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కోసం 26.52 బిలియన్ డాలర్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేయనుంది. ఇది గత ఆర్ధిక సంవత్సరం కంటే 10 శాతం లేదా 24.11 బిలియన్ డాలర్లు ఎక్కువని తెలుస్తోంది.

  6. ప్రజల ఇంటి నిర్మాణాల కోసం 15 శాతం కంటే ఎక్కువ నిధులు పెంచే అవకాశం ఉంది.


Also Read: Kumari Aunty: స్ట్రీట్‌ ఫుడ్‌ కుమారి ఆంటీపై కేసు.. ఆందోళనలో ఆమె అభిమానులు

Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి