Union Budget on February 1 | న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు జనవరి 29నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం (lok sabha secretariat) సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 29 నుంచి లోక్‌సభ మొదటి విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే జనవరి 29న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న ఉదయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. Also read: Farmers Protest: నేడు తొమ్మిదో దఫా చర్చలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29 జనవరి  నుంచి 15 ఫిబ్రవరి వరకు తొలివిడత సమావేశాలు జరగనుండగా.. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం (Central government) నిర్ణయించింది. అయితే చివరిసారిగా సెప్టెంబరులో వర్షాకాల సమావేశాలు ఏడు రోజులపాటే జరిగాయి. కరోనావైరస్ (Coronavirus) కారణంగా ఆ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతోపాటు (Parliament) శీతాకాల సమావేశాలను సైతం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: Republic day: విదేశీ అతిధి లేకుండానే గణతంత్ర దినోత్సవ వేడుకలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook