రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఓ బస్సు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది మృతి చెందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్ లోని కోట జిల్లాలోని లాల్సుత్ మెగా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.  బస్సులో మొత్తం ఎంత మంది ఉన్నారు..? అందులో ఎవరైనా సురక్షితంగా బయటపడ్డారా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. 


మరోవైపు బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటనేది తెలియరావడం లేదు. డ్రైవర్ మద్యం మత్తులో  ఉన్నాడా..? లేక నిద్ర మత్తులో ఉన్నాడా..? లేదా బస్సు వంతెనపైకి రాగానే ఏదైనా వాహనం అడ్డువచ్చిందా ..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు బస్సును నీటిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సు నదిలో బోర్లా పడిపోవడంతోనే అందరూ చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 


[[{"fid":"182477","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Read Also: బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ ఇదిగో..