Bus Ticket For Chick: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసే బస్సుల్లో వ్యక్తులతో పాటు వారు తీసుకెళ్లే వస్తువులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే! అయితే అది కూడా కొన్ని అపరిమిత వస్తువుల కోసం మాత్రమే బస్సు కండెక్టర్ లగేజి ఛార్జీ వసూలు చేస్తాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఓ బుల్లి కోడి పిల్లకు హాఫ్ టికెట్ తీసుకున్న వింత ఘటన కర్ణాటకలో జరిగింది. సిద్ధపుర నుంచి ఓ సంచార కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. రూ.10 చెల్లించి కోడి పిల్లను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని హోసనగర వద్ద కేయస్ఆర్టీసీ బస్సు ఎక్కారు. కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలని కండక్టర్ డిమాండ్ చేశాడు. 


బస్సులో కోడిపిల్లకు టికెట్ తీసుకోవాలనే నియమం ఉందని అతడు చెప్పడం వల్ల.. చేసేదేం లేక ఆ కుటుంబం ఆ కోడి పిల్ల కోసం హాఫ్ టికెట్ తీసుకుంది. ఇలా రూ.10తో కొనుగోలు చేసిన కోడి పిల్లను తీసుకెళ్లేందుకు.. ఆ కుటుంబం రూ.50 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.


Also Read: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం... నదిలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 28 మందికి గాయాలు!


Also Read: Dog Bite CCTV Footage: నాలుగేళ్ల బాలికపై వీధి శునకాల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి