Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం... నదిలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 28 మందికి గాయాలు!

Bus Accident: డ్రైవర్​ నిద్రమత్తులో బస్సును నడిపి నదిలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, 28 మంది గాయపడ్డారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 06:35 PM IST
  • మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
  • నిద్రమత్తులో బస్సు నడిపిన డ్రైవర్
  • నదిలోకి దూసుకెళ్లిన బస్సు, ముగ్గురు మృతి
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం... నదిలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 28 మందికి గాయాలు!

Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఘోర ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. అలీరాజ్‌పూర్ జిల్లాలో (Alirajpur District) ఆదివారం ఉదయం బస్సు నదిలో పడిపోవడంతో (Bus Falls Into River) ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నాడు. క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను కలెక్టర్​, ఎస్పీ సహా పలువురు పరామర్శించారు.

గుజరాత్‌లోని ఛోటా ఉదేపూర్ నుండి బస్సు అలీరాజ్‌పూర్‌కు వెళ్తుండగా జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్‌పూర్ గ్రామ (Chandpur village) సమీపంలో ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. బస్సు డ్రైవర్ నిద్రపోవడంతో వాహనం మెల్‌ఖోద్రా నదిలో ( Melkhodra river) పడిపోయినట్లు తెలుస్తోంది. చిన్నారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కైలాష్ మేడా (48), మీరాబాయి (46) అక్కడికక్కడే మృతి చెందగా, మరో 28 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. 

Also Read: Stampede: వైష్ణవదేవి ఆలయంలో భారీగా తొక్కిసలాట, 13 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x