Anand Mahindra Job Offers To UP Girl: బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. యువతకు తరచుగా స్తూర్తిని నింపే విధంగా పోస్టులు చేస్తుంటారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన కూడా తనదైన స్టైల్ లో రెస్పాండ్ అవుతుంటారు. అదేవిధంగా ప్రత్యేకంగా టాలెంట్ కల్గిఉండి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే, వారిని తరచుగా ట్యాగ్ చేస్తు అభినందిస్తున్నారు. కొందరికి తనదైన స్టైల్ ఆనంద్ మహీంద్రా సర్ ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా.. ఒక ఉత్తర ప్రదేశ్ లోని ఒక బాలికకు ఆనంద్ మహీంద్రా తన కంపెనీలో జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు. అత్యంత ఒత్తిడి సమయంలో బాలిక అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ను ఉపయోగించుకుని, కోతులకు చుక్కలు చూపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. బస్తీ జిల్లాకు చెందిన నికిత అనేత అనే బాలిక తన మేనకోడలు వామిక తో కలిసి ఆడుకుంటుంది.  ఇంతలో పదుల సంఖ్యలో కోతులు వీరి ఇంట్లోకి ప్రవేశించాయి. ఇంట్లోని వస్తువులన్నింటికి చిందరవందరగా పారేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నారి నికిత వెంటనే ఆమె ఇంట్లో ఉన్న అలెక్సా పరికరం గుర్తుకు వచ్చింది. అలెక్సా మనంఎలా చెబితే అలా చేస్తుంది. దీంతో చిన్నారి వెంటనే.. అలెక్సా శునకంలా మొరుగు అని చెప్పింది. దీంతో అలెక్సా పరికరం నుంచి గట్టిగా కుక్కలు అరుస్తున్నట్లుగా శబ్దాలు వచ్చాయి. దీంతో కోతులు భయపడి ఇంట్లో నుంచి పారిపోయాయి.


చిన్నారి టాలెంట్ కు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఇది కాస్త ఆనంద్ మహీంద్రా కళ్లలో పడింది. ఆయన చిన్నారి సమయస్పూర్తికి అభినందించారు. అంతేకాకుండా.. భవిష్యత్తులు ఆమె విద్యాభ్యాసం పూర్తైన తర్వాత తమ కంపెనీలో జాబ్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు కూడా ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో చిన్నారికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నవయస్సులోనే ఇంతటి సమయ స్పూర్తి, ఏకంగా ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజ కంపెనీలో జాబ్ ఆఫర్ రావడం పట్ల కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..


చిన్నతనం నుంచి మనం పిల్లల్ని ఎలా పెంచితే అలా తయారవుతారని ఆనంద్ మహీంద్రా చెబుతుంటారు. పిల్లల మెదడుకు పదును పెట్టే విషయాలు, వారి ఆలోచనలు ప్రభావితమయ్యేలా తల్లిదండ్రులు వారిలో మార్పులు వచ్చేలా మంచి విషయాలు చెప్పాలని ఆనంద్ మహీంద్రా సూచిస్తుంటారు.   
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook