Tips To Buy Gold At Low Cost | బంగారం కొనుగోలుపై ఆర్బిఐ కీలక ప్రకటన చేసింది. 999 ప్యూరిటీ ఉన్న బంగారం ( Gold ) యావరేజ్ క్లోజింగ్ విలువను రూ.5,177  ప్రతీ గ్రాము అని ప్రకటించింది. ధంతెరాస్ ( Dhanteras ) సందర్భంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ 2020-21 ట్రాంచే ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసింది. సోమవారం నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. నవంబర్9 నుంచి 13 వరకు వీటిని కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.5,177 నిర్ణయించాం అని ఆర్బిఐ తెలిపింది. Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బంగారం కొనుగోలుపై ( Buying Gold for Dhanteras) ఆర్బిఐ కీలక ప్రకటన చేసింది. 999 ప్యూరిటీ ఉన్న బంగారం యావరేజ్ క్లోజింగ్ విలువను రూ.5,177  ప్రతీ గ్రాము అని ప్రకటించింది.



అన్‌లైన్‌లో సావరిన్ బాండ్స్ కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు ఆర్బిఐ స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రతీ గ్రాముకు రూ.50 నామినల్ వాల్యూపై తగ్గించనున్నట్టు తెలిపింది. డిజిటల్ పేమెంట్ చేసేవారు ఈ డిస్కౌంట్ ను వినియోగించుకోవచ్చు. Also Read  | Donald Trump: మెలానియా విడాకులు ఇచ్చేస్తుందా ? రహస్యాలు వెల్లడించిన పీఏ!



అలాంటి ఇన్వెస్టర్ల కోసం గోల్డ్ బాండ్ ధర రూ.5,127గా ఉంటుంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI) తెలిపింది.


అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 16 మధ్యలో ఇష్యూ అయిన బాండ్స్ ( VII సిరీస్) ధరను ప్రతీ గ్రాముకు రూ.5,051గా నిర్ణయించారు.  బాండ్స్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారు ఇలా తక్కువ ధరలోనే సావరిన్ బాండ్స్ ( Sovereign Gold Bond 2020-21) సొంతం చేసుకోచ్చు. Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR