పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ( CAA ) కు మరో మూడు నెలల సమయం పట్టనుంది. పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు ఇంకా రూపుదిద్దుకోనందున మూడు నెలల గడువు లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, పలు ప్రాంతాాల్లో అల్లర్లకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టం ( Citizenship Amendment Act ) అమలుకు మరో మూడు నెలల సమయం పట్టవచ్చు. నిబంధనల్ని రూపొందించేందుకు మరో మూడు నెలల గడువు కావాలని కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు హోంశాఖ ( Home ministry ) పార్లమెంటరీ కమిటీకు విజ్ఞప్తి చేసింది. నిబంధనల ప్రకారం ఏదైనా చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత 6 నెలల్లోగా నిబంధనల్ని రూపొందించుకోవల్సి ఉంటుంది. లేకపోతే మరో మూడు నెలల గడువును కోరవచ్చు. పౌరసత్వ సవరణ చట్టంలో నిబంధనల రూపకల్పన జరగకపోవడంతో అదనపు సమయాన్నికోరింది హోంశాఖ. పార్లమెంటరీ కమిటీ ( Parliamentary committee ) దీన్ని ఆమోదించే అవకాశాలున్నాయి.


పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో అణచివేతకు గురైన ముస్లిమేతర మైనార్టీలకు భారతదేశ పౌరసత్వం కల్పించే ఉద్దేశ్యంతో సీఏఏ ( CAA ) ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం తరువాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ( President Ramnath Kovind ) దీనికి ఆమోదముద్ర వేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల తీవ్రత, లాక్ డౌన్ నేపధ్యంలో ఆ అల్లర్లు, ధర్నాలు దాదాపుగా ఆగిపోయాయి. Also read: జిమ్‌కు వెళ్లాలంటే ఆ మూడూ ఉండాల్సిందే