Capgemini Vacancies: ఐటీ సెక్టార్‌లో జాబ్ కోసం చూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్ జెమిని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, తగిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యుమ్‌తో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హత, ముఖ్య తేదీలు, ఆన్‌లైన్ ఫామ్ లింక్, తదితర సంబంధిత సమాచారాన్ని ఈ కింద తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖాళీల వివరాలు :


SAP IBP కన్సల్టెంట్ పొజిషన్ కోసం క్యాప్ జెమిని దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదేని గ్రాడ్యుయేషన్‌తో పాటు 4-9 ఏళ్ల అనుభవం కలిగినవారు ఇందుకు అర్హులు.


అభ్యర్థులకు ఉండాల్సిన స్కిల్స్ : 


SAP IBPలో వివిధ మాడ్యుల్స్‌ను ఇంప్లిమెంట్ చేసిన అనుభవం కలిగి ఉండాలి. ముఖ్యంగా ఎస్&ఓపీ అండ్ డిమాండ్. సీపీఐపై పూర్తి అవగాహన, సీపీఐ యాక్టివిటీస్ నిర్వహించే కనీస పరిజ్ఞానం ఉండాలి. SAP IBPలో అన్ని మాడ్యుల్స్‌పై సమగ్రమైన పట్టుతో పాటు ఎస్ &ఓపీ, డిమాండ్, సప్లై అండ్ రెస్పాన్స్, ఇన్వెంటరీ.. వీటిల్లో కనీసం రెండింటిలో నిపుణులై ఉండాలి. ఐబీపీ డిమాండ్, మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్‌పై పట్టు కలిగి ఉండాలి. షిఫ్ట్ టైమింగ్స్‌లో పనిచేయాలి.


ముఖ్య వివరాలు :


లొకేషన్ : కోల్‌కతా, హైదరాబాద్/సికింద్రాబాద్, పుణే, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ఎన్‌సీఆర్, ముంబై, ఇండియా (కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్)


ఖాళీలు : 10
సాలరీ వివరాలు : వెల్లడించలేదు
ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ : 17/03/2022
అప్లికేషన్ ప్రక్రియ : ఆన్‌లైన్
సమయం, వేదిక : మార్చి 21, ఉదయం 10గం. నుంచి సాయంత్రం 4గం. వరకు, క్యాప్ జెమిని సెక్టార్ 64 నోయిడా. కాంటాక్ట్ - హరదీప్ (8097448146). పూర్తి వివరాలకు క్యాప్ జెమిని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

 


Also Read: SBI Alert: ఎస్ఎంఎస్ లింక్‌లపై క్లిక్ చేశారో..మీ ఎక్కౌంట్ ఖాళీ అయినట్టే


Also read: PAN-Aadhaar: గడువు ముగుస్తోంది పాన్​-ఆధార్​ లింక్​ చేశారా? ఇప్పుడే చెక్​ చేసుకోండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook