PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ అనుంధానానికి తుది గడువు సమీపిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ గడువులోపు ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయకుంటే ఆర్థిక పరమైన లావాదేవీల విషయాల్లో అనే ఇబ్బందులు ఎదురవ్వచ్చు.
నిజానికి ఆధార్ పాన్ అనుసంధానానికి అనేక సార్లు గడువు పొడగించింది ప్రభుత్వం. కరోనా కారణంగా అనేక సార్లు గడువు పెంచగా.. మరోసారి ఇందుకు అవకాశం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
అందుకే గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది. మార్చి 31లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయకుంటే పాన్ నిరుపయోగంగా మారుతుందని కూడా వెల్లడించింది.
ఇన్‌కం ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్లు సులంభంగా ఇంట్లోనే పాన్-ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకునే వీలుంది. అంతే కాదు ఆదార్‌తో-పాన్ అనుసంధానమైందా లేదా అనే విషయాన్ని కూడా తనిఖీ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా ఇన్‌కం ట్యాక్స్ వెబ్సైట్లోకి (www.incometax.gov.in) లాగిన్ అవ్వాలి
- ఇక్కడ క్విక్ లింక్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇందులో 'లింక్ ఆధార్ స్టేటస్' అనే స్టేటస్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్-ఆధార్ నంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఆధార్-పాన్ వివరాలు సమర్పించిన తర్వాత.. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఆధార్-పాన్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆధార్ పాన్ లింక్ అయ్యుంటే.. పాన్-ఆధార్ అనుసంధానమై ఉందని ఇంగ్లీష్‌లో ఉంటుంది.
- ఒకవేళ అనుసంధానం పూర్తవకుంటే.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.
Also read: TATA Digital Payments: డిజిటల్ పేమెంట్స్ వ్యాపారంలో టాటా సంస్థ, త్వరలో ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook