Case registered against RJD leader Tejashwi Yadav: పాట్నా: కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు ( Farm Laws ) వ్య‌తిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు మద్దతుగా.. కేంద్రం అమలు చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) బీహార్‌లోని పాట్నా గాంధీ మైదాన్‌ (Gandhi Maidan, Patna) లో శనివారం నిర‌స‌న కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని అనుమతి లేకుండా నిర్వహించడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ( Tejashwi Yadav ) తోపాటు ఆ పార్టీకి చెందిన 18 మంది నాయకులు, గుర్తు తెలియని మరో 500 మందిపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై పాట్నా పోలీసులు వారిపై అంటు వ్యాధుల చట్టం (Epidemic Diseases Act) తోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ కార్య‌క్ర‌మానికి రైతులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నిర‌స‌నకారులు కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంట‌నే కొత్త చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్జేడీ అధ్య‌క్షుడు తేజ‌స్వి యాద‌వ్‌ మాట్లాడుతూ.. ఇటీవ‌ల కేంద్రం అమలు చేసిన రైతు వ్య‌తిరేక ‘న‌ల్ల‌ చ‌ట్టాల‌ను’ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.  Also read: Farmer protests: ప‌ద్మ‌విభూష‌ణ్‌ను వెన‌క్కిచ్చిన పంజాబ్ మాజీ సీఎం


 Also read: Rajinikanth: జనవరిలో తలైవా రాజకీయ అరంగ్రేటం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook