Cashless Everywhere Treatment:హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (GIC) పెద్ద నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పుడు పాలసీదారులు దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్సను పొందగలుగుతారు. ఇకపై దేశంలో ఎక్కడైనా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇక IRDA సూచనల అమలుకు అయా బీమా సంస్థలు కూడా ఒప్పుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు ఇలాంటి సౌలభ్యం ఇన్సూరెన్స్ కంపెనీలతో టై అప్ అయిన ఆసుపత్రులకు మాత్రమే వర్తించేది. 2024 జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా క్యాష్ లెస్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పింది. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (GIC) 2001 సంవత్సరంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)చే స్థాపించబడింది. ఇది IRDAI , జీవిత బీమా పరిశ్రమ మధ్య లింక్‌గా పనిచేస్తుంది. ఇటీవల, GIC ద్వారా 'క్యాష్‌లెస్ ఎవ్రీవేర్' పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించింది.


ఆరోగ్య బీమా పాలసీదారులు ఇంతకుముందు ఆ బీమా కంపెనీతో టై-అప్ ఉన్న ఆసుపత్రులలో మాత్రమే నగదు రహిత చికిత్సను పొందేవారు. బీమా కంపెనీతో టై-అప్ లేకపోతే జేబులో నుండి మొత్తం డబ్బు చెల్లించాలి. తరువాత, ఆసుపత్రి బిల్లు సహాయంతో బీమా కంపెనీ నుండి రీయింబర్స్‌మెంట్ పొందాల్సి ఉండేది. ఈ కారణంగా చికిత్స సమయంలో రోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.


రాష్ట్ర ఆరోగ్య అధికారంలో నమోదు చేయబడిన 15 కంటే ఎక్కువ పడకలతో దేశంలోని అన్ని ఆసుపత్రులలో రోగులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం ఉంటుంది. పాలసీదారులందరికీ ఈ కొత్త సదుపాయం ప్రయోజనం లభిస్తుంది, ఇప్పటికే పాలసీ తీసుకున్న వారు కూడా ప్రయోజనం పొందుతారు. దీని కోసం ఎవరూ ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. 



మీరు చికిత్స పొందాలనుకునే ఆసుపత్రికి మీ బీమా కంపెనీతో టై-అప్ లేకపోతే, మీరు చికిత్స ప్రారంభించటానికి 48 గంటల ముందు దాని గురించి కంపెనీకి తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల్లో, నగదు రహిత చికిత్స ప్రయోజనాన్ని పొందడానికి, మీరు ఆస్పత్రిలో చేరిన 48 గంటలలోపు బీమా కంపెనీకి తెలియజేయాలి.పాలసీదారులకు నిబంధనల ప్రకారం వర్తిస్తేనే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌలభ్యం ఉంటుంది.



ఇక ఈ క్యాష్ లెస్ విధానంతో చికిత్స భారం తగ్గడంతోపాటు సకాలంలో వైద్యం చేసుకోవచ్చు. దీంతో పాలసీదారుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉంది.


ఇదీ చదవండి: Social Media Viral: ఫాస్టెస్ట్ రూట్ అని గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మాడు.. చివరికి ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్లిందో తెలుసా?  


ఇదీ చదవండి: Jobs in Supreme Court: లా పట్టాదారులకు గుడ్ న్యూస్.. రూ. 80 వేల జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook