Jobs in Supreme Court: లా పట్టాదారులకు గుడ్ న్యూస్.. రూ. 80 వేల జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..

Supreme Court Recruitment 2024: సుప్రీంకోర్టులో లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ వెలువడింది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు

Written by - Renuka Godugu | Last Updated : Jan 30, 2024, 02:25 PM IST
Jobs in Supreme Court: లా పట్టాదారులకు గుడ్ న్యూస్.. రూ. 80 వేల జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..

Supreme Court Recruitment 2024: సుప్రీంకోర్టులో లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ వెలువడింది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు

లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ పోస్టుల కోసం భారత సుప్రీంకోర్టు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు SCI main.sci.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సుప్రీంకోర్టులో 90 పోస్టులను భర్తీ చేయనున్నారు.

చివరి తేదీ..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024  జనవరి 24న ప్రారంభమై, ఫిబ్రవరి 15న ముగుస్తుంది.  అభ్యర్థి వయస్సు 20-32 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ లో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్య తేదీలు..
దరఖాస్తుకు చివరి తేదీ: 2024 ఫిబ్రవరి 15 
రాత పరీక్ష: 2024 మార్చి 10 
కీ విడుదల: 2024 మార్చి 11 
అభ్యంతరాలకు చివరి తేదీ: 2024 మార్చి 12
 
అర్హత ..
బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుంచి పొంది ఉండాలి. భారతదేశంలోని బార్ ద్వారా గుర్తింపు పొంది ఉండాలి.

జీతం..
లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ. 80,000 జీతం లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ .. 
పార్ట్ 1 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్
పార్ట్ 2  రాత పరీక్ష
పార్ట్ 3 ఇంటర్వ్యూ

దరఖాస్తు ..
అభ్యర్థుల పరీక్ష ఛార్జీలు రూ. 500 ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లింపు చేయాలి. UCO బ్యాంక్ అందించిన పేమెంట్ గేట్‌వే ద్వారా ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఇదీ చదవండి: Side Effect of Paper Cup: మీరూ పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

ఇదీ చదవండి: Home Cleaning Tips: రూ.2 కాఫీ సాచెట్ మీ ఇంటికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News