మెగా ఫ్యామిలీపై అసత్య ప్రచారం చేస్తున్న ఛానళ్లను నిషేదించేలా చేయాలని భావిస్తున్న పవన్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఈ అంశంపై మద్దుతు కూడగడుతున్న పవన్ కల్యాణ్ కు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ సపోర్ట్ లభించలేదు. ఈ విషయంలో పవన్ కు మద్దతిచ్చేది లేదని 'మా' సభ్యులు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్లినట్లయితే..చర్చ కార్యక్రమాల పేరుతో నటులను టార్గెట్ చేస్తున్న టీవీ ఛానళ్లను బహిష్కరించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిందే. మెగా ఫ్యామిలీ మెంబర్ అల్లు అరవింద్ ఈ అంశాన్ని  మావీ అర్ట్స్ అసోసియేషన్ ముందు ఉంచారు. ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలకు మద్దతిచ్చి ..అలాంటి చానళ్లను బహిర్కించాలని ప్రతిపాదించారు. ఈ  ప్రతిపాదనకు సభ్యులు తిరస్కరించినట్లు సమాచారం. 


సదురు ఛానళ్లను దూరం పెడదామని చెప్పిన అరవింద్ చెప్పిన వేళ.. సభ్యులు, సినీ ప్రముఖలు విముఖత చూపినట్లు సమాచారం. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చిన వేళ నిశ్శబ్దంగా ఉన్న మెగా ఫ్యామిలీ...తమదాకా వచ్చిన తరువాతనే బయటకు వచ్చిందని అల్లు అరవింద్ ముందే కొందరు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది.