న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక అధికారి (ఓఎస్‌డీ) అరెస్ట్ అయ్యాడు. గోపాల్ క్రిష్ణ మాధవ్ ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌టా పట్టుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల ప్రచారం ముగిసి, కొన్ని గంటల్లో ఎన్నికలనగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలకనేత, డిప్యూటీ సీఎం సిసోడియా కింద పనిచేసే అధికారి లంచం కేసులో పట్టుబడటం ప్రభుత్వ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read; BJP 40స్థానాలకు పైగా గెలుస్తుంది: అమిత్ షా


అండమాన్ నికోబార్ ఐలాండ్ సివిల్ సర్వీసెస్ (డీఏఎన్ఐసీఎస్) అధికారి  గోపాల్ క్రిష్ణ మాధవ్ ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఓఎస్‌డీగా 2015లో నియమితులైనట్లు ఢిల్లీ ప్రభుత్వ వెబ్ సైట్‌లో ఉంది.  ఆయన లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా క్రిష్ణ మాధవ్‌ను పట్టుకుని, తమ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మనీష్ సిసోడియాకు ఈ లంచం కేసుతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ సీబీఐ విచారణ కొనసాగిస్తోంది.


Also Read: జన్ లోకపాల్, దేశభక్తి ప్రధానాంశాలుగా ఆప్ మేనిఫెస్టో


కాగా, మనీష్ సిసోడియాపై గురువారం క్రిమినల్ కేసు నమోదైంది. గతేడాది డిసెంబర్ నెలలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఆందోళన నేపథ్యంలో బస్సులకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టడంపై ఢిల్లీ పోలీసులపై తీవ్రవ్యాఖ్యలు చేయడం తెలిసిందే. 22ఏళ్ల తర్వాత ఢిల్లీలో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), షాహిన్ బాగ్ విషయాల్లో అధికార ఆప్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.


Also Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆస్తుల విలువెంతో తెలుసా?   


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..