ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల (12వ తరగతి) ఫలితాలు (CBSE Class 12th Result 2020) వచ్చేశాయ్. సోమవారం నాడు ఫలితాలను సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. ఈ సంద‌ర్భంగా ప‌రీక్ష‌లు పాసై వారికి విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ శుభాకాంక్ష‌లు తెలిపారు. SBI జాబ్స్‌కు అప్లై చేశారా.. నేడు ఆఖరు తేదీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీబీఎస్‌ఈ విద్యార్థులు ఫలితాలను ఈ కింది లింక్స్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్ 1
వెబ్‌సైట్ 2
వెబ్‌సైట్ 3  

ఈ ఏడాది మొత్తంగా 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. గ‌తేడాదితో పోల్చితే 5.38శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలురి కంటే 5.96శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 97.67శాతం ఫలితాలతో త్రివేండ్రం అగ్రస్థానంలో నిలవగా, 74.57శాతంతో పాట్నా అట్టడుగున నిలిచింది.​  RGV ‘పవర్ స్టార్’ మూవీ స్టిల్స్ వైరల్



క‌రోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ వాయిదా వేసిన పలు పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు గత నెలలో సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలిపింది. అయితే గతంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. రద్దయిన పరీక్షలకు మార్కుల‌ను అసెస్‌మెంట్ చేసి పలితాలు ప్రకటిస్తోంది. విద్యార్థులు తమ ఫలితాల (CBSE Class 12 Exam Result 2020)ను Umang యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. India: ఆందోళన పెంచుతున్న కరోనా మరణాలు
CBSE Class 12 exam results announced. Overall Pass Percentage is 88.78