New Covid Vaccine: ఇండియా త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది. మరో మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ మార్కెట్లో త్వరలో రానుంది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి పొందిన ఈ వ్యాక్సిన్ కూడా హైదరాబాద్ నుంచే కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఇండియాలో విశృంఖలంగా విస్తరిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దేశంలో ప్రస్తుతం రెండు రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి ఆక్స్‌ఫర్డ్ భాగస్వామ్యంతో పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute) ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్( Covishield vaccine). మరొకటి పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ( Bharat Biotech) కంపెనీ కోవ్యాగ్జిన్( Covaxin). ఈ రెండు వ్యాక్సిన్‌లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో మరో శుభవార్త అందుతోంది. ఇండియా నుంచి మరో కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో మార్కెట్‌లో రానుంది. ఈ వ్యాక్సిన్ కూడా హైదరాబాద్‌కు చెందిన కంపెనీది కావడం విశేషం.


హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ లిమిటెడ్( Biological E limited). బీఈ గా పిలుస్తారు. చాలాకాలంగా ఈ కంపెనీ కూడా వ్యాక్సిన్ రంగంలో ఉంది. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనేజేషన్ అనుమతి లభించింది. బీఇ కంపెనీ ( BE Company vaccine) గత ఏడాది అంటే 2020 నవంబర్ రెండవ వారంలో తొలి రెండు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. రెండు దశల్ని విజయవంతంగా పూర్తి చేశామని..సానుకూల ఫలితాలు వచ్చాయని బీఈ ఎండి మహిమ దాట్ల తెలిపారు. పరీక్షల్లో పాల్గొన్నవారి భద్రత, రోగ నిరోధక శక్తిని అంచనా వేశామని చెప్పారు. రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌లో చాలా పాజిటివ్ ఫలితాలు చూశామని..మూడవ దశలో ఆశాజనక ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్టు మహిమ చెప్పారు. దేశవ్యాప్తంగా 18-80 ఏళ్ల వయస్సున్న 1268 మంది ఆరోగ్యవంతులపై మూడవ దశ పరీక్షలు ( BE Vaccine 3rd phase trials) నిర్వహించనున్నారు. ఈ వ్యాక్సిన్ కూడా రెండు డోసుల్లో 28 రోజుల కాలవ్యవధిలో ఉంటుంది. 


Also read: Covishield vs Covaxin: ఏ వ్యాక్సిన్ మంచిది..ఏది కాదు, గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook