Election Commission: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎట్టేకేలకు ఎన్నికల కమీషన్‌లో చలనం వచ్చింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల అనంతరం నిర్ణయాలు మార్చుకుంటోంది. దేశంలో జరగాల్సిన ఉపఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. కరోనా ఉధృతికి ఎన్నికల కమీషన్ కారణమని..ఎన్నికల సంఘం అధికారులపై హత్యానేరం ఎందుకు మోపకూడదంటూ మద్రాస్ హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వ్యాఖ్యలతో ఎన్నికల సంఘంలో మార్పు వచ్చినట్టు కన్పిస్తోంది. మే 2వ తేదీన జరిగిన కౌంటింగ్‌లో కట్టుదిట్టమైన నిబంధనల్ని తీసుకొచ్చింది.ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికల్ని వాయిదా వేయాలని ఈసీ (Election Commission) నిర్ణయించింది. కరోనా అదుపులో వచ్చి..పరిస్థితులు అనుకూలించేవరకూ ఉపఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని ఈసీ అభిప్రాయపడింది.


ప్రస్తుతం దేశంలో మూడు ఎంపీ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు (Bypolls) జరగాల్సి ఉన్నాయి. దాద్రా-నాగర్ హవేలి, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. మరోవైపు హర్యానాలోని కల్కా, ఎల్లైనాబాద్, రాజస్థాన్‌లోని వల్లభనగర్, కర్నాటకలోని సింగి, మేఘాలయలోని రాజబాలా, మావరింగ్ కెంగ్, హిమాచల్ ప్రదేశ్‌లోని ఫతేపూర్, ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మరికొన్ని ఖాళీ స్థానాలకు సంబంధించి నివేదికలు రావల్సి ఉంది.


Also read: India Covid Status: చెన్నై, బెంగళూరులో పరిస్థితి దారుణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook