Loksabha Elections 2024: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, ఎన్నిదశల్లో ఎన్నికలు జరగనున్నాయంటే
Loksabha Elections 2024: దేశంలో అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా అని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు మీ కోసం.
Loksabha Elections 2024: మరి కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలుండవచ్చనే అంచనాల నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ ఒడిశాలో ఎన్నికల ఏర్పాట్లపై పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్టు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిసా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ మొదటి, రెండవ వారాల్లో ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్టు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
తాజాగా ఎన్నికల బాండ్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికల బాండ్ల రద్దును అమలు చేస్తామని, న్యాయస్థానం సూచనల్ని పాటిస్తామని చెప్పారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు 5 లేదా 6 దశల్లో జరగవచ్చని తెలుస్తోంది. 2014లో 9 దశల్లో జరిగితే, 2019లో 7 దశల్లో జరిగాయి. ఈసారి ఎన్ని దశల్లో జరగనుందనే విషయంపై ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావల్సి ఉంది.
ఒడిశా అసెంబ్లీలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉంటే అందులో మహిళా ఓటర్లు 1.64 కోట్లు కాగా, పురుషుల సంఖ్య 1.68 కోట్లుగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాదికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈసారి 3,380 ధర్డ్ జెండర్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 37,809 పోలింగ్ కేంద్రాలుంటే వాటిలో 22,685 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు.
Also read: Madhya Pradesh Politics: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook