One Nation one Election: జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం వెనకడుగు..? కారణం అదేనా..
One Nation one Election: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకు రేపు రాబోతున్నట్టు సమాచారం. కానీ అనూహ్యంగా కేంద్రం ఈ బిల్లుపై వెనకడుగు వేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
One Nation one Election: దేశంలో లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయప్రయాసలతో పాటు సమయం కూడా వృథా అవుతోందని కేంద్రం ఈ బిల్లును తీసుకువస్తోంది. కానీ తాజాగా ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం జమిలి ఎన్నికల బిల్లుల పై కేంద్రం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.
తాజాగా లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించారు. మొదట ఈ నెల 16న లోక్‌సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఆమేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో కూడా రెడీ చేసారు.కానీ కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లు పెడతారని కేంద్రం తెలిపింది. కానీ.. తాజాగా రివైజ్డ్ చేసిన లోక్‌సభ బిజినెస్‌లో జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లులు లేవు. ఈ నెల 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ సారి జమిలి బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందా? లేదా అనే ఆసక్తి నెలకొంది. వక్ఫ్ బిల్లు మాదిరే దీనిపై ఏదైనా పార్లమెంట్ కమిటీ వేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
అయితే.. జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనం, సమయం ఆదా అవుతుందని కేంద్రం చెబుతోంది. జమిలి వల్ల పదేపదే ఎలక్షన్ కోడ్ అమలుచేయాల్సిన అవసరం ఉండదనేది కేంద్రం చెబుతున్న వాదన . దానివల్ల అభివృద్ధి పనులు నిరాటంకంగా జరుగుతాయంటోంది. ఎన్నికల విధులకు మానవ వనరుల వినియోగం తగ్గి ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయంటోంది. ఈ కారణాల రీత్యా జమిలి ఎన్నికల నిర్వహణ దేశానికెంతో అవసరమని బిల్లులో అభిప్రాయపడింది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టిన కేంద్ర మంత్రిమండలి.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు ఈ నెల 12న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే కదా.
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్ 82Aను చేర్చాల్సి ఉంటుంది. అదేసమయంలో పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం ఆర్టికల్ 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు..ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే.. ఆర్టికల్ 327ని సవరణ చేయాల్సి ఉంటుంది.
జమిలి ఎన్నికల చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు అయిదేళ్లకు ఒకసారి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు అధికారంలో కొనసాగాల్సిన ప్రభుత్వాలు ఏదైనా పరిస్థితుల్లో కూలిపోయినా, లేదా రద్దయినా... ఆయా అసెంబ్లీలు, లోక్‌సభకు మాత్రమే...అయిదేళ్లలో మిగిలి ఉన్న కాలం కోసమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని శాసనసభలు, లోక్‌సభతో పాటే జమిలి ఎన్నికలు జరుగుతాయి.
జమిలి ఎన్నికల కోసం తీసుకువస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం దేశంలోని 50శాతం రాష్ట్రాల ఆమోదం పొందాలన్న నిబంధన వర్తించదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంటుకు ఉంటుందని గుర్తుచేశాయి. జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో సాధారణ మెజారిటీతోనే ఆమోదించుకునేలా కేంద్ర ప్రభుత్వం మరో బిల్లును రెడీ చేసింది. దీనిని కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. శాసనసభలున్న మూడు కేంద్ర పాలిత ప్రాంతాల కు సంబంధించిన చట్టాలను అక్కడ జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుకల్పించేలా కేంద్రం సవరించనుంది. ఇందుకోసం విడిగా బిల్లులను ప్రవేశపెట్టనుందని సమాచారం.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం