CBSE 10th Exams 2021: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షల్ని మాత్రం వాయిదా వేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) కోరలు చాస్తోంది. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన జారీ చేసింది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం (Central government) నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు 12 తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నామని.. జూన్‌లో పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ వెల్లడించారు.


అయితే సీబీఎస్‌ ( CBSE 10th Class Exams) పదో తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసిన తరుణంలో..విద్యార్ధుల్ని ఎలా ప్రమోట్‌ చేస్తారు. ఎలా ర్యాంకులను నిర్థారిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా ఒకేవేళ 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తే.. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉంటాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పదో తరగతి బోర్డు ఫలితాలను విద్యార్థుల ఆబ్జెక్టివ్ నైపుణ్యాల ఆధారంగా ప్రకటిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాతిపదికన కేటాయించిన మార్కులతో విద్యార్థులు సంతృప్తి చెందకపోతే.. పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్లీ పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తారు.


వాస్తవానికి సీబీఎస్ఈ పరీక్షలు (CBSE Examinations)యథాతధంగా జరుగుతాయని..మే 4 జూన్ 15 మధ్య జరగతాయని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. మే 4 నుంచి జూన్ 7 వరకు 10 వ తరగతి పరీక్షలు, మే 4 మరియు జూన్ 15 మధ్య 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కోవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలు పార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకత మధ్యలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యాశాఖ మంత్రి, అధికారులతో సమీక్షించారు.


Also read: West Bengal Assembly Elections 2021: ఎన్నికల సంఘం నిషేధానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook