West Bengal Assembly Elections 2021: ఎన్నికల సంఘం నిషేధానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నా

West Bengal Assembly Elections 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఘట్టం ఆసక్తిగా మారుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో నిరసనగా మమతా బెనర్జీ ధర్నాకు దిగి సంచలనం రేపారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 14, 2021, 12:15 PM IST
West Bengal Assembly Elections 2021: ఎన్నికల సంఘం నిషేధానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నా

West Bengal Assembly Elections 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఘట్టం ఆసక్తిగా మారుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో నిరసనగా మమతా బెనర్జీ ధర్నాకు దిగి సంచలనం రేపారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు(West Bengal Assembly Elections) రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాల్ని ఘొరావ్ చేయాలంటూ ప్రజల్ని రెచ్చగొట్టారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee) ప్రచారంపై ఎన్నికల సంఘం (Election commission Ban ) 24 గంటల వరకూ నిషేధం విధించింది. కేంద్ర బలగాల్ని ఘొరావ్ చేయాలంటూ ప్రజల్ని రెచ్చగొట్టడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా ఈసీ పరిగణించింది. సోమవారం రాత్రి 8 గంటల్నించి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఈ నిషేధం అమలైంది. అయితే తన ప్రచారంపై ఎన్నికల సంఘం విధించిన నిషేధానికి నిరసనగా కోల్‌కత్తాలోని గాంధీ విగ్రహం వద్ద మమతా బెనర్జీ ధర్నా ( Mamata Banerjee Dharna)కు దిగారు. వీల్‌ఛైర్‌పై బైఠాయించి..తనకిష్టమైన పెయింటింగ్స్ వేస్తూ నిరసన కొనసాగించారు. తానెంతో శ్రద్ధగా గీసిన పెయింటింగ్స్‌ను మీడియా ప్రతినిధులకు చూపించారు. 

మరోవైపు ధర్నా స్థలం వద్ద ఇతర సీనియర్ టీఎంసీ(TMC) నేతలెవరూ కన్పించలేదు. తాను ఒంటరిగానే ధర్నా నిర్వహిస్తానని..ఎవరరూ రావద్దని పార్టీ నేతలకు మమతా సూచించారు. ఇందుకు అనుగుణంగానే మమతా బెనర్జీ ఒంటరిగానే ధర్నా కొనసాగించారు. బీజేపీ (Bjp) నాయకత్వం చేతిలో పావుగా వ్యవహరిస్తోందంటూ కేంద్ర బలగాలపై ఎన్నికల ప్రచార సమయంలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల దగ్గర తమను అడ్డుకుంటే కేంద్ర బలగాలను మహిళలు ఘెరావ్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా విధ్వేషాలను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై మమతపై ఈసీ 24 గంటల నిషేధం విధించింది.

Also read: Corona second wave: పగలు వదిలేసి..నైట్ కర్ఫ్యూ విధిస్తే ప్రయోజనమేంటనే ప్రశ్నలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News