Covovax: చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ విషయంలో కేంద్ర నిపుణుల కమిటీ అభ్యంతరం తెలిపింది. చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ ద్వారా దేశంలో మార్కెటింగ్ చేయాలనుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు ఎదురు దెబ్బ తగిలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి నియంత్రణకై అమెరికాకు చెందిన నొవావాక్స్ (Novavax)కంపెనీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో కొవొవాక్స్ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే మార్చ్ నెలలో 18 ఏళ్లు పైబడినవారిపై కంపెనీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించగా..జూలై నుంచి చిన్నారులపై కూడా క్లినికల్ ట్రయల్స్ చేయాలని భావించింది. అందుకు అనుగుణంగా అనుమతి కోరుతూ డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. 


అయితే కొవొవాక్స్ వ్యాక్సిన్‌(Covovax)కు ఇప్పటి వరకూ ఏ దేశంలోనూ అనుమతి లభించలేదనే విషయాన్ని నిపుణుల కమిటీ గుర్తించింది. దాంతో 2-17 ఏళ్ల వయస్సున్న పిల్లలపై కొవొవాక్స్ క్లినికల్ ట్రయల్స్(Clinical trias on children) అప్పుడే వద్దని..నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. పిల్లలపై 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వవద్దవి డీసీజీఐ(DCGI)కు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా 12-17 ఏళ్ల వయస్సుున్న 460 మందిపై, 2-11 ఏళ్ల వయస్సున్న మరో 460 మందిపై పది ప్రాంతాల్లో క్లినికల్ ట్రయల్స్ చేయాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute) భావించింది. పెద్దలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్ని, భద్రత, ఇమ్యునోజెనిసిటి డేటాను సమర్పించాలని..అప్పుడే నిర్ణయం తీసుకుంటామని నిపుణుల కమిటీ తెలిపింది. 


Also read: National Doctors Day: కష్టకాలంలో ప్రాణాల్ని లెక్కచేయని వైద్యులకు సెల్యూట్


https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook