EPF Interest rate: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ వడ్డీ రేటును ఖరారు చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌పై వడ్డీరేటును శ్రీనగర్‌లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్(EPF)డిపాజిట్లపై వడ్డీరేటును ప్రతియేటా ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(Central Board of Trusties)సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు. శ్రీనగర్‌లో జరిగిన సమావేశంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరమైన 2020-21కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయించింది కేంద్రప్రభుత్వం( Central government).అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈసారి వడ్డీ రేటు తగ్గించే అవకాశముందని ప్రచారం జరిగినా...గత యేడాది ఉన్న వడ్డీ రేటునే కొనసాగించారు. ఈ నిర్ణయంతో ఏకంగా 6 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 2018 -19 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ అమలు చేశారు. 


కోవిడ్‌ 19 మహమ్మారితో ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా.. ఉద్యోగులు తమ ఖాతాల నుంచి భారీగా నగదును ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో డిపాజిట్లు తగ్గిపోయాయి. గత ఏడాది డిసెంబరు వరకూ దాదాపు 2 కోట్ల మంది ఈపీఎఫ్‌వో (EPFO)వినియోగదారులు 73వేల కోట్లను వెనక్కి తీసుకున్నారని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 2018-19లో 81వేల కోట్లను చందాదారులు వెనక్కి తీసుకోగా.. 2020 21లో అంతకుమించిన స్థాయిలో ఉపసంహరణలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల పీఎఫ్ వాటా ఏడాదికి 2.5 లక్షలు దాటితే వడ్డీపై పన్ను విధించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union minister nirmala sitaraman) బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా తెలిపారు.


Also read: Fuel prices: అధికారంలో వస్తే లీటర్ పెట్రోల్ 60 రూపాయలకే : BJP


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook