Covid New Guidelines: కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. కరోనా ఇతర వేరియంట్లతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3 లక్షల 37 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా సంక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం...రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సూచన మేరకు కొత్త మార్గదర్శకాలు (Covid New Guidelines) జారీ అయ్యాయి.


కరోనా వైరస్ (Coronavirus) సోకిన బాధితులు..కోలుకున్న 3 నెలల తరువాతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Union Health Ministry) సూచించింది. ప్రికాషన్ డోసు విషయంలో కూడా ఇదే పద్ధతి ఉంటుందని తెలిపింది. అయితే కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు విషయంలో ప్రపంచవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని దేశాల్లో బూస్టర్ డోసుకు ఆరు నెలల కాల వ్యవధి నిర్ణయిస్తే..మరికొన్ని దేశాల్లో కోవిడ్ నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయవచ్చని చెబుతున్నారు. వ్యాక్సిన్‌తో శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ఆరు నెలల్లో తగ్గుతాయనే అంచనాపై వివిద దేశాల పరిశోధకులు ఆరు నెలల కాల వ్యవధి ప్రతిపాదన చేశారు. 


మరోవైపు ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దేశంలో 15-18 ఏళ్ల వయస్సువారికి కోవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccination) ఇస్తున్నారు. కోవిడ్ ఫ్రంట్‌లైన్ సిబ్బందికి, ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి, 60 ఏళ్లు పైబడినవారికి జనవరి 10 నుంచి కరోనా థర్ద్‌డోసు (Corona Third Dose) అందిస్తున్నారు.


Also read: Covid 19 Update: దేశంలో వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook